News May 29, 2024

కుప్పం: బంగినపల్లి టన్ను రూ.50 వేలు

image

మామిడి పండ్లకు మార్కెట్ లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడాది మామిడి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కుప్పం ప్రాంతంలో వేల ఎకరాలలో బంగినపల్లి, తోతాపురి, నీలం, చందూరా తదితర రకాల మామిడికాయలు సాగు చేస్తున్నారు. బంగినపల్లి టన్ను 42 వేల నుంచి 50 వేలు, చందూరా రకం 30 వేల నుంచి 40 వేలు వరకు ధర పలుకుతోంది. క్రిమి సంహారక మందుల ఖర్చు కూడా రావడం లేదని రైతులు అంటున్నారు.

Similar News

News July 8, 2025

జగన్ రాక.. వైసీపీ నేతలకు నోటీసులు

image

చిత్తూరు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. బంగారుపాళ్యం మార్కెట్‌లో 500 మందితోనే మామిడి రైతులను పరామర్శించాలని పోలీసులు సూచించారు. ఈనేపథ్యంలో భారీ సంఖ్యలో నాయకులు బుధవారం బంగారుపాళ్యం వెళ్లకుండా ఉండేలా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా జిల్లాలోని వైసీపీ ముఖ్య నాయకులలకు మంగళవారం నుంచే నోటీసులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసమీకరణ చేయరాదని నోటీసుల్లో పేర్కొన్నారు.

News July 8, 2025

10న చిత్తూరు జిల్లాలో PTM

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం(PTM) ఈనెల 10న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. తల్లిదండ్రులకు వారి పిల్లల సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటాలని సూచించారు.

News July 7, 2025

చిత్తూరు: అంటీముట్టనట్లుగానే వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు?

image

ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా నియోజకవర్గాల్లో వైసీపీ బలోపేతానికి కృషి చేయాల్సిన మాజీలు ఎక్కడా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. YCP అధికారంలో ఉన్నన్ని రోజులు చుట్టపు MLAలుగా ఉన్న ఆ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదేతరహాలో వ్యవహరిస్తున్నారట. పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, కుప్పం ఇన్‌ఛార్జ్‌లు రాష్ట్రస్థాయిలో మినహా నియోజకవర్గ కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.