News May 29, 2024

గుంటూరు: జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

image

జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు గుంటూరు జిల్లాకు చెందిన ఎస్.చరణ్, హాసిని ఎంపికయ్యారని జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధరరావు, కడియం జయరావు మంగళవారం పేర్కొన్నారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2 వరకు పంజాబ్‌లో జరగనున్న జాతీయ పోటీల్లో వీరిద్దరూ పాల్గొంటారన్నారు. ఈనెల 15 నుంచి 17వరకు విజయవాడలో జరిగిన రాష్ట్ర పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా వీరి ఎంపిక జరిగిందన్నారు.

Similar News

News November 10, 2025

గుంటూరు జిల్లా: బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా !

image

కేంద్ర ఆర్ధిక శాఖ మీ డబ్బు–మీ హక్కు పేరుతో దేశ వ్యాప్త ప్రచారంలో భాగంగా రూపొందించిన పోస్టర్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. జిల్లాలో 7,18,055 రిటైల్ ఖాతాలలో రూ.120 కోట్లు ఉన్నాయని చెప్పారు. 24,221 ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్ ఖాతాలలో రూ. 22.02 కోట్లు , 6,672 గవర్నమెంట్ ఖాతాలలో రూ.7.03 కోట్లు మొత్తం రూ.149.47 కోట్లు అన్ క్లైమ్ద్ డిపోజిట్స్ వున్నాయని అన్నారు.

News November 10, 2025

వర్షపు నీటిని ఒడిసి పడదాం: ఎంపీ పెమ్మసాని

image

వర్షపు నీటిని ఒడిసి పట్టి.. జీవనాధారం పెంచుదామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ మహోత్సవ్‌పై రెండ్రోజుల జాతీయ సదస్సు గుంటూరు వెల్కమ్ గ్రాండ్ హోటల్లో సోమవారం ప్రారంభమైంది. పెమ్మసాని మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తుందని, సీఎం చంద్రబాబు మంచి విజన్‌తో ఆ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.

News November 10, 2025

దళిత ఉద్యమ కెరటం డాక్టర్ కత్తి పద్మారావు

image

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఘంటా చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతపురంలో జరిగిన సభకు అనివార్య కారణాల వల్ల పద్మారావు హాజరుకాలేదు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.