News May 29, 2024
మంజీరా నదిలో నీట మునిగి ఇద్దరు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1716990118766-normal-WIFI.webp)
బీర్కూర్ మండలం మంజీరా నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు గల్లంతైన ఘటన బుధవారం కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బీర్కూర్‌కు చెందిన కటికే పండరి(30), టిల్లు(12) స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కాసేపటికి పండరి, టిల్లు మృతదేహాలు బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 12, 2025
నిజామాబాద్‌లో ఫొటో జర్నలిస్టు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739330939752_50486028-normal-WIFI.webp)
నిజామాబాద్‌లో అనారోగ్యంతో సీనియర్ ఫొటో జర్నలిస్టు రమణ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన పలు వార్త పత్రికల్లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. కాగా ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు.
News February 12, 2025
NZB: బావిలో పడి బాలుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739294889526_1269-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లాలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం ఇందల్వాయి మండలం డొంకల్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన లక్ష్మణ్(13) మరో ఇద్దరితో కలిసి మేకలు కాయడానికి గ్రామ శివారులోకి వెళ్లారు. బావిలో నీటిని తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు వెళ్లి చూసేసరికి లక్ష్మణ్ మృతి చెందినట్లు వెల్లడించారు.
News February 12, 2025
NZB: టెన్త్ అర్హతతో 42 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739294822314_728-normal-WIFI.webp)
నిజామాబాద్ డివిజన్‌లో 42 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.