News May 29, 2024
13 చరణాలు.. 2.30నిమిషాల నిడివి?
తెలంగాణ గీతం ‘జయ జయహే తెలంగాణ’పై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 13 చరణాలున్న ఈ గీతం 2.30నిమిషాల నిడివితో రూపొందించినట్లు సమాచారం. గతంలో ఇందులో 11 చరణాలుండేవి. ఇప్పుడు అదనంగా మరో 2 జోడించినట్లు తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. ఈ గీతాన్ని అందెశ్రీ రచించగా.. కీరవాణి సంగీతం అందించారు.
Similar News
News January 19, 2025
జట్టు వెంట ఫ్యామిలీ అదనపు భారం: యోగ్‌రాజ్
టోర్నీల కోసం టీమ్ ప్రయాణాల్లో క్రికెటర్ల కుటుంబాలపై BCCI విధించిన ఆంక్షలను UV తండ్రి యోగ్‌రాజ్ సమర్థించారు. ‘దేశం కోసం ఆడుతున్నప్పుడు జట్టు వెంట ప్లేయర్ల భార్య, పిల్లలు ఎందుకు? వాళ్లు అదనపు భారమే కాకుండా ఏకాగ్రతను దెబ్బతీస్తారు. రిటైర్మెంట్ తర్వాత వారితో ఎంత సేపైనా గడపవచ్చు. ప్రస్తుతం జట్టే కుటుంబం’ అని పేర్కొన్నారు. అలాగే CT కోసం ఎంపిక చేసిన టీమ్ కూర్పు బాగుందని యోగ్‌రాజ్ అభినందించారు.
News January 19, 2025
ప్రజా ధనంతో ఫ్రెండ్‌కు పవన్ రిటర్న్ గిఫ్ట్: YCP
AP: ఏ అనుభవం ఉందని ఓర్వకల్లులో ఈ-మొబిలిటీ పార్కు కోసం పీపుల్ టెక్ సంస్థకు 1200 ఎకరాలు కేటాయించారని YCP ప్రశ్నిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ మిత్రుడు, వ్యాపార భాగస్వామి అయిన TG విశ్వ ప్రసాద్ కంపెనీ కావడం వల్లే ఈ ఒప్పందం జరిగిందని ఆరోపించింది. ఎన్నికల్లో ఆర్థికంగా సహకరించిన స్నేహితుడికి జనసేనాని ఇలా ప్రజా ధనంతో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ధ్వజమెత్తింది. కాగా ఈ పీపుల్ గ్రూప్ బ్యానర్ Bro మూవీ నిర్మించింది.
News January 19, 2025
ఈ-మొబిలిటీ పార్క్: YCP ప్రధాన ఆరోపణలివే..
– ఈ-బైక్స్ తయారీలో పీపుల్ టెక్‌కు అనుభవం లేదు
– బైక్స్ తయారీ కోసం భాగస్వామ్య కంపెనీని ఎంచుకోలేదని చెబుతూనే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది
– రూ.2100 కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయి ఆ సంస్థకు లేదు
– పీపుల్ టెక్ సంస్థ పవన్ స్నేహితుడు టీజీ విశ్వప్రసాద్‌ది కావడం వల్లే ఎకరా రూ.కోటికి పైగా పలికే భూమిని రూ.15 లక్షల చొప్పున 1200 ఎకరాలు <<15197150>>అప్పగించే ప్రయత్నం<<>>
– భూముల దోపిడీకే ఓర్వకల్లు కారిడార్‌కు క్యాబినెట్ ఆమోదం