News May 29, 2024

కృష్ణా: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే

image

వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికుల సౌలభ్యం కోసం కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే 2 ట్రైన్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.20811 విశాఖపట్నం- నాందేడ్(జూన్ 1 నుంచి 29), నం.20811 నాందేడ్- విశాఖపట్నం(జూన్ 2 నుంచి 30) ట్రైన్లకు ఒక స్లీపర్ కోచ్, 3 ఏసీ త్రీ టైర్ ఎకానమీ కోచ్‌లు అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకటించిన తేదీల్లో ఈ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News April 24, 2025

గుడివాడ: వైసీపీకి హనుమంతరావు రాజీనామా..?

image

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు రాజీనామా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న ఆయన, కూటమి అక్రమాలపై కలెక్టర్‌కు వినతి కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన బాటలోనే మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మండలి హనుమంతరావు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

News April 24, 2025

మచిలీపట్నం: నేడు జిల్లా సమీక్షా మండలి సమావేశం

image

కృష్ణాజిల్లాలో మండల సమీక్షా సమావేశం గురువారం మచిలీపట్నంలో జరగనుంది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సురేష్ అధ్యక్షతన ఉదయం 10.30ని.లకు జడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ప్రజా ప్రతినిథులు పాల్గొననున్నారు. అధికారులు తమ శాఖలకు చెందిన ప్రగతి నివేదికలతో హాజరు కావాలని చెప్పారు. 

News April 24, 2025

మచిలీపట్నం: ‘హోంగార్డ్ సంక్షేమానికి కృషి చేస్తాం’

image

పోలీస్ శాఖలో అంతర్భాగంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్స్ సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామని కృష్ణాజిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ గంగాధరరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హోంగార్డ్స్ సమస్యల పరిష్కారానికి దర్బార్ నిర్వహించారు. హోంగార్డుల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!