News May 30, 2024

సెప్టెంబర్ 27న థియేటర్లలోకి లక్కీ భాస్కర్

image

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. దుల్కర్ ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే.

Similar News

News January 19, 2025

Debate: తమ్ముళ్ల ఆలోచన అదేనా..?

image

లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే TDP డిమాండ్‌పై నెట్టింట డిబేట్ అవుతోంది. గతంలో కీలక మంత్రిగా, ప్రతిపక్షంలో పాదయాత్రతో జనాల్లోకి వెళ్లిన ఆయన ఈ పదవికి అర్హుడని TDP అంటోంది. కానీ ఇది పవన్‌ను కంట్రోల్ చేసే స్టెప్ అనేది జనసేన వర్షన్. చంద్రబాబు సైతం కంట్రోల్ చేయలేకపోతున్న పవన్‌ను బ్యాలెన్స్ చేయాలంటే లోకేశ్ No.2గా ఉండాలనేది తెలుగు తమ్ముళ్ల ఆలోచన అంటున్నారు. మరి నిజంగానే క్యాడర్ కోరికనా? కట్టడి ప్రయత్నమా?

News January 19, 2025

జుట్టు బాగా రాలుతోందా..? ఇలా చేశారంటే..

image

– మీ చర్మం, జుట్టుకు ఏ తరహా షాంపూ/ప్రొడక్ట్ సెట్ అవుతుందో డాక్టర్‌తో తెలుసుకుని వాటిని వాడటం బెటర్
– రోజూ తలస్నానం చేస్తే కుదుళ్లు పొడిగా మారి వెంట్రుకలు రాలుతాయి. చెమట, పనిని బట్టి వారానికి 2-3సార్లు తలస్నానం మంచిది.
– జడ/జుట్టు బంధించినట్లు కాకుండా కాస్త వదులుగా ఉంచితే రక్త ప్రసరణ సులువై వెంట్రుకలు బలంగా ఉంటాయి
– ఎక్కువ కాలం హెయిర్ డ్రయర్ వాడవద్దు
– ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా జుట్టు రాలుతుంది

News January 19, 2025

కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్

image

AP: సంక్రాంతి సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారంతా తిరుగుపయనం అవుతున్నారు. సోమవారం నుంచి స్కూళ్లు, ఆఫీస్‌లు ఉండటంతో ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్లే బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. పండగ నేపథ్యంలో విజయవాడ నుంచి 133 అదనపు బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.