News May 30, 2024
GOOD NEWS: పుస్తకాల రేట్లు తగ్గించిన ప్రభుత్వం
TG: జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో అన్ని మీడియంలకు చెందిన పాఠ్యపుస్తకాల ధరలు తగ్గనున్నాయి. ఒక్కో బుక్‌పై ₹10 నుంచి ₹74 వరకు తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. మార్కెట్‌లో పేపర్ రేటు తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో క్లాస్ బుక్స్ రేట్స్‌పై పేరెంట్స్‌కు ₹200-300 ఆదా కానుంది. ఉదాహరణకు 2023-24లో టెన్త్ పుస్తకాల ధర ₹1,482 ఉండగా ఈసారి ₹1,126కి తగ్గింది.
Similar News
News January 19, 2025
Debate: తమ్ముళ్ల ఆలోచన అదేనా..?
లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే TDP డిమాండ్‌పై నెట్టింట డిబేట్ అవుతోంది. గతంలో కీలక మంత్రిగా, ప్రతిపక్షంలో పాదయాత్రతో జనాల్లోకి వెళ్లిన ఆయన ఈ పదవికి అర్హుడని TDP అంటోంది. కానీ ఇది పవన్‌ను కంట్రోల్ చేసే స్టెప్ అనేది జనసేన వర్షన్. చంద్రబాబు సైతం కంట్రోల్ చేయలేకపోతున్న పవన్‌ను బ్యాలెన్స్ చేయాలంటే లోకేశ్ No.2గా ఉండాలనేది తెలుగు తమ్ముళ్ల ఆలోచన అంటున్నారు. మరి నిజంగానే క్యాడర్ కోరికనా? కట్టడి ప్రయత్నమా?
News January 19, 2025
జుట్టు బాగా రాలుతోందా..? ఇలా చేశారంటే..
– మీ చర్మం, జుట్టుకు ఏ తరహా షాంపూ/ప్రొడక్ట్ సెట్ అవుతుందో డాక్టర్‌తో తెలుసుకుని వాటిని వాడటం బెటర్
– రోజూ తలస్నానం చేస్తే కుదుళ్లు పొడిగా మారి వెంట్రుకలు రాలుతాయి. చెమట, పనిని బట్టి వారానికి 2-3సార్లు తలస్నానం మంచిది.
– జడ/జుట్టు బంధించినట్లు కాకుండా కాస్త వదులుగా ఉంచితే రక్త ప్రసరణ సులువై వెంట్రుకలు బలంగా ఉంటాయి
– ఎక్కువ కాలం హెయిర్ డ్రయర్ వాడవద్దు
– ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా జుట్టు రాలుతుంది
News January 19, 2025
కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్
AP: సంక్రాంతి సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారంతా తిరుగుపయనం అవుతున్నారు. సోమవారం నుంచి స్కూళ్లు, ఆఫీస్‌లు ఉండటంతో ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్లే బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. పండగ నేపథ్యంలో విజయవాడ నుంచి 133 అదనపు బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.