News May 30, 2024
నెల్లూరు: వేర్వేరు ఘటనల్లో ఈత కొడుతూ ఇద్దరి దుర్మరణం

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. విడవలూరు(M) వెంకటనారాయణపురం వాసి మురళీకృష్ణ స్నేహితులతో కలిసి పైడేరువాగు వంతెన వద్ద ఈతకొడుతూ నీటిలో మునిగి మృతిచెందాడు. ఇందుకూరుపేట(M), రాముడుపాలేనికి చెందిన రామయ్య,గీతల కుమార్తె భవ్యశ్రీ(12) నెల్లూరు వెంగళరావునగర్‌లో గల స్విమ్మింగ్‌ఫూల్‌లో ఈతకొడుతూ నీటిలో మునిగిపోయింది. బాలికను సిబ్బంది బయటకుతీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News November 10, 2025
ట్రాన్స్‌జెండర్లకు ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డుల పంపిణీ

జిల్లా దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సుమారు 30 మంది ట్రాన్స్‌జెండర్లకు కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. 2019 హిజ్రాల చట్టం ప్రకారం వారికి సమాజంలో గౌరవం కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ పోర్టల్ ద్వారా వీటిని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
News November 10, 2025
జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మకు మాతృవియోగం

నెల్లూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాతృమూర్తి కోడూరు సరస్వతమ్మ గత రాత్రి మృతి చెందారు. దివంగత కోడూరు అయ్యప్ప రెడ్డి సతీమణి వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి అత్త గత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు బాలాజీ నగర్‌లో అంతిమయాత్ర సాగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News November 10, 2025
జిల్లా వ్యాప్తంగా హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు

SP డా అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 77 ప్రత్యేక బృందాలతో హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని సంతపేట పరిధిలోని ఓ లాడ్జ్‌లో ఆకస్మిక తనిఖీ చేయగా, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 6 KGల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడానికి లాడ్జిలు, హోటల్స్‌ను ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు.


