News May 30, 2024
యర్రగొండపాలెం ఆర్ఓ సస్పెండ్

యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీలేఖను తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి మీనా కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 13న జరిగిన పోలింగ్‌లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో, సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు తెలిపారు. గురువారం నియోజకవర్గంకు కొత్త ఆర్ఓ ను కలెక్టర్ నియమించనున్నట్లు చెప్పారు.
Similar News
News November 10, 2025
ఢిల్లీలో పేలుళ్లు.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు!

ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోమవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఒంగోలులోని బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్ బృందంతోపాటు పోలీసులు తనిఖీలు నిర్వహించి, అనుమానిత వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
News November 10, 2025
రేపే సీఎం రాక.. బందోబస్తు వివరాలు వెల్లడించిన ఎస్పీ!

రేపు పీసీపల్లి మండలంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన బందోబస్తు వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తెలిపారు. ఇద్దరు ఏఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 49 మంది ఎస్‌ఐలతో పాటు మొత్తం 800 మంది పోలీసులు, హోం గార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్లు చెప్పారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా 6 ప్రత్యేక మొబైల్ బైక్ పెట్రోలింగ్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు.
News November 10, 2025
ప్రకాశమంతా ఒకటే చర్చ.. ఆ ప్రకటన వచ్చేనా?

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మార్కాపురం జిల్లా ప్రకటనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. సీఎం చంద్రబాబు నేడు నిర్వహించనున్న క్యాబినెట్ సమావేశంలో జిల్లాల ఏర్పాటుపై తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం జిల్లాగా, శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురంలో విలీనం చేస్తారా? లేదా అన్నది కూడా తేలే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.


