News May 30, 2024
ఏలూరు: దాడి చేస్తారనే భయంతో సూసైడ్

తనపై దాడి చేస్తారనే భయంతో భీమడోలుకు చెందిన జయరాజు మజ్జిగలో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. జయరాజు ఈనెల 27న కొంతమందితో గొడవపడ్డాడు. అయితే వారు తిరిగి తనపై దాడి చేస్తారనే భయంతో బుధవారం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 13, 2025
భీమవరం: సోమేశ్వర జనార్ధన స్వామిని తాకిన సూర్య కిరణాలు

భీమవరం గునుపూడిలో కొలువైన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారిని శనివారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. సూర్యోదయ సమయంలో ఈ అద్భుత దృశ్యం కనిపించిందని ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారని ఆయన చెప్పారు.
News September 12, 2025
ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలి: జేసీ

జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో అక్టోబర్ మొదటి వారం నుంచి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు ప్రారంభం కావున అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.
News September 11, 2025
మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా దృష్టి: కలెక్టర్

స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో బుధవారం ఉపాధి అంశంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గుర్రపు డెక్క నుంచి వర్మి కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి మండలంలో మూడు యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.