News May 30, 2024

రేపు విశాఖ-పలాస పాసింజర్ రద్దు

image

వాల్తేరు డివిజన్ నౌపడ- పూండి సెక్షన్లో వంతెనల పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ శుక్రవారం పలు రైళ్లను రద్దు చేసినట్టు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఆరోజు శుక్రవారం పలాస-విశాఖ (07471) (07470) ప్రత్యేక మెమో పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి సహకరించాలని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్ కోరారు.

Similar News

News November 30, 2024

ఎచ్చెర్ల: పింఛను సొమ్ము కోసం దాడి

image

పింఛను సొమ్ము కోసం సచివాలయ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన  ట్రిపుల్ ఐటీ సమీపంలోని రాజీవ్ స్వగృహ కాలనీ వద్ద శుక్రవారం జరిగింది. బాధితుని కథనం..ఎస్ఎం పురం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ విష్ణు ఎచ్చెర్ల SBIలో రూ. 24 లక్షలకు పైగా డ్రా చేసుకుని వస్తున్నారు. గమనించిన ఇద్దరు ఆగంతకులు బైకు ఆపే ప్రయత్నం చేసి, రాడ్డుతో దాడి చేయగా తప్పించుకుని సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

News November 30, 2024

అరసవిల్లి గుడికి రూ.100 కోట్లు ఇవ్వండి: మంత్రి

image

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను పౌర విమానయాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ఢిల్లీలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం చరిత్రను వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రసాద్ పథకం కింద అరసవిల్లి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. రూ.100 కోట్లతో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని విన్నవించారు.

News November 30, 2024

శ్రీకాకుళం: నేడే పెన్షన్ అందజేత  

image

శ్రీకాకుళం జిల్లాలో నేడే పింఛను లబ్ధిదారులకు పెన్షన్ అందజేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,14,386 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరి కోసం ప్రభుత్వం ప్రతినెల రూ.129 కోట్లకు పైగా నగదును అందజేస్తోంది. ఇప్పటికే నగదును బ్యాంకుల్లో జమ చేయగా సచివాలయ సిబ్బంది విత్ డ్రా చేసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు స్వయంగా సిబ్బంది అందజేయనున్నారు. కాగా ఆదివారం సెలవు కావడంతో శనివారం అందజేస్తారు.