News May 30, 2024

ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు: కేటీఆర్

image

TS: రాజకీయ కుట్రతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మార్పు చేయాలని నిర్ణయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అధికారిక ముద్ర మార్పును నిరసిస్తూ చార్మినార్ వద్ద ధర్నాకు దిగారు. గత పదేళ్లలో చేసిన ప్రగతిని కనిపించకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకుండా ఇలాంటి చర్యలకు దిగడం తగదని అన్నారు.

Similar News

News October 15, 2024

ఆధారాలు ఇవ్వకుండా ఆరోపణలేంటి ట్రూడో!

image

రాజకీయ లబ్ధి కోసం కెనడా PM జస్టిన్ ట్రూడో నీచ స్థాయికి దిగజారారని విశ్లేషకులు అంటున్నారు. ఖలిస్థానీలు సహా తమ పౌరుల్ని హతమార్చేందుకు భారత దౌత్యవేత్తలు సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారన్న ఆయన ఆరోపణల్ని కొట్టిపారేశారు. హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకేసు ఆధారాలను భారత్‌కు ఇంకా ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడూ ఎవిడెన్స్‌లు ఇవ్వకుండా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. >>comment

News October 15, 2024

RAIN EFFECT: ఆ జిల్లాలో 3 రోజులు సెలవులు

image

AP: అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీసత్యసాయి జిల్లాలో నేటి నుంచి 17 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చిత్తూరులో ఇవాళ, రేపు, అనంతపురంలో బుధ, గురువారాలు సెలవులు ఇస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.

News October 15, 2024

‘ఎన్టీఆర్ బేబీ కిట్’ స్కీమ్ తీసుకురానున్న ప్రభుత్వం?

image

AP: గతంలో అమలైన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీని కోసం తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ఇలాంటి పథకాలను అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో 2016లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ కిట్‌లో దుప్పటి, దోమతెర, స్లీపింగ్ బెడ్, పౌడర్, లోషన్, న్యాప్‌కిన్, డైపర్స్ వంటివి ఉంచి బాలింతలకు అందించేవారు.