News May 30, 2024

WGL: గ్రాడ్యుయేట్ అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

image

ఇటీవల జరిగిన NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉప ఎన్నిక ఫలితంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇక్కడి పోలింగ్ సరళిపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 5న జరుగనున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలుతుందా లేక ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో విజయం సాధిస్తారా? అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యర్థులు ఎవరికి వారే తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 4, 2024

మలుగు: రోడ్డుపై భారీ కొండచిలువ

image

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుంచి కుమ్మరిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ కొండచిలువ గురువారం రాత్రి ప్రత్యక్షమైంది. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 10 అడుగుల పొడవు ఉందని స్థానికులు తెలిపారు. కాగా ప్రయాణికుల చప్పుడుతో పొదల్లోకి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

News October 3, 2024

వరంగల్: నేడు ఎస్జీటీ అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన

image

వరంగల్ జిల్లా ఎస్జీటీ 1:3 నిష్పత్తిలో భాగంగా గురువారం 271 నుంచి 435 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. నిన్న సర్టిఫికెట్ పరిశీలనకు రాని అభ్యర్థులు.. ఈరోజు కూడా అటెండ్ అవ్వవచ్చన్నారు. అభ్యర్థులు వచ్చే ముందు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సంబంధిత గెజిటెడ్ సంతకంతో సర్టిఫికెట్లన్నీ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అన్నారు.

News October 3, 2024

ములుగు: పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి

image

పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. శంకరాజుపల్లి గ్రామానికి చెందిన సుమన్, మానస దంపతుల కుమారుడు గగన్(3) చిన్నబోయినపల్లిలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాము కాటు వేసింది. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం తరలించగా పరిస్థితి విషమించి నేడు మృతి చెందాడు.