News May 30, 2024

టంగుటూరు టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టివేత

image

చెన్నై నుంచి మిర్యాలగూడకు వెళుతున్న కారులో భారీగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టంగుటూరు హైవే మీద ఉన్న టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా మద్దిశెట్టి మల్లేష్ వద్ద బిల్లులు లేకుండా 112 గ్రాముల బంగారం తీసుకెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఇందులో రూ.58 వేలు నగదు, రూ.89,98,220 విలువచేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశామని ఎస్సై పున్నారావు తెలిపారు.

Similar News

News November 30, 2024

చీమకుర్తిలో కిడ్నాప్ 

image

ప్రకాశం జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం మడగడ గ్రామానికి చెందిన దినేశ్(16)ని కిడ్నాప్ చేశారు. ఈక్రమంలో అతడిని చీమకుర్తి గాంధీనగర్‌లో ఉంటున్న అరవింద్ అనే వ్యక్తి ఇంటికి కిడ్నాపర్లు తీసుకు వచ్చారు. దినేశ్ వారి నుంచి తప్పించుకుని చీమకుర్తి పోలీసులను ఆశ్రయించాడు. CI సుబ్బారావు కిడ్నాపర్లను వెంబడించి ఒకరిని పట్టుకోగా మరో ఇద్దరు పరారయ్యారు.

News November 28, 2024

రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం రేపు ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం ఉదయం TN-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 4రోజుల పాటు వర్షాలు కురుస్తాయంది. రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.

News November 28, 2024

పెట్లూరు సచివాలయాన్ని తనిఖీ చేసిన మంత్రి స్వామి

image

కొండపి మండలం పెట్లూరులో గ్రామ సచివాలయాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రికార్డుల పరిశీలించి, నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బందిని రేషనలైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. సేవలన్నీ ప్రజలకు సకాలంలో అందించాలని ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు.