News May 30, 2024
గుంటూరు వెస్ట్ అసెంబ్లీలో 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 94 నంబర్ గల గుంటూరు వెస్ట్ అసెంబ్లీ లో మొత్తం 282 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరిగింది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో 21 రౌండ్‌లలో లెక్కించనున్నారు. రౌండ్‌ల వారీగా ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది.
Similar News
News November 11, 2025
ఢిల్లీ పేలుళ్లు.. గుంటూరు పోలీసుల అప్రమత్తం

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత కోసం రైల్వేస్టేషన్, బస్టాండ్, వాణిజ్య సముదాయాలు, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు సంచారం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
News November 11, 2025
గుంటూరు జిల్లా: బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా !

కేంద్ర ఆర్ధిక శాఖ మీ డబ్బు–మీ హక్కు పేరుతో దేశ వ్యాప్త ప్రచారంలో భాగంగా రూపొందించిన పోస్టర్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. జిల్లాలో 7,18,055 రిటైల్ ఖాతాలలో రూ.120 కోట్లు ఉన్నాయని చెప్పారు. 24,221 ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్ ఖాతాలలో రూ. 22.02 కోట్లు , 6,672 గవర్నమెంట్ ఖాతాలలో రూ.7.03 కోట్లు మొత్తం రూ.149.47 కోట్లు అన్ క్లైమ్ద్ డిపోజిట్స్ వున్నాయని అన్నారు.