News May 30, 2024

ఇండియా కూటమికి స్పష్టమైన ఆధిక్యం: ఖర్గే

image

ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన ఆధిక్యం వస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశానికి సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పారు. ‘ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో 421 సార్లు మత, విభజన వాద వ్యాఖ్యలు చేశారు. కులమతాల ఆధారంగా ఓట్లు అభ్యర్థించకూడదని ఈసీ నిబంధనలు ఉన్నా వాటిని ఉల్లంఘించారు. 758 సార్లు తన సొంత పేరే తలుచుకున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు.

Similar News

News April 8, 2026

ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే 50% టారిఫ్: ట్రంప్

image

ఇరాన్‌తో సీజ్‌ఫైర్ కొనసాగుతున్న వేళ ఇతర దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు 50% టారిఫ్స్ విధిస్తానని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

News April 8, 2026

టెన్త్, ఇంటర్ ఫలితాలు.. ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉందంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ ఫలితాలు ఎప్పుడొస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సందిగ్ధం నెలకొంది. అయితే APలో ఈ నెల 3వ వారంలో ఇంటర్, నెలాఖరున టెన్త్ రిజల్ట్స్ వస్తాయని సమాచారం. TGలో ఈ నెల 10లేదా12వ తేదీ అని ప్రచారం జరిగినా 15-20వ తేదీ లోపు ఇంటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సుంది. అటు టెన్త్ పరీక్షలు ఇంకా ముగియలేదు. పూర్తైన పేపర్ల వాల్యుయేషన్ జరుగుతుండటంతో ఈ నెలాఖరుకే ఫలితాలు వస్తాయని తెలుస్తోంది.

News April 8, 2026

చిన్న పొరపాటు.. పెద్ద సీటుకు గండి!

image

నామినేషన్‌లో <<19598336>>అభ్యర్థుల<<>> పొరపాటుతో విజయ్ TVK ముఖ్యమైన స్థానంలో పోటీచేసే ఛాన్స్ కోల్పోయింది. గుర్తింపు లేని పార్టీ అభ్యర్థికి నామినేషన్‌లో మద్దతుగా కనీసం 10 సంతకాలు ఉండాలి. ఎడప్పాడిలో TVK అది మిస్ చేసి సీటుకే ఎసరు తెచ్చుకుంది. TN మాజీ సీఎం, AIADMK చీఫ్ పళనిస్వామి పోటీ చేస్తున్న ఈ చోట రాణించుంటే TVKకి రాజకీయంగా కలిసొచ్చేది. దీంతో మొత్తం 234 సీట్లు కాగా ఇప్పుడు 233 చోట్ల పోటీ చేయనుంది. <<-se>>#Elections2026<<>>