News May 30, 2024

ITR చేస్తున్నారా? జూన్ 15 వరకూ ఆగండి!

image

2023-24FYకి సంబంధించిన ITR ఫైలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఉద్యోగస్థులు జూన్ 15 వరకు వేచి చూడటం ఉత్తమమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వారి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఫాం 26AS మే 31న అప్డేట్ అవుతాయి. ఆ తర్వాత 15 రోజుల్లో TDS సర్టిఫికెట్లు వస్తాయి. సో, జూన్ 15లోపు చేస్తే ITRలో ఇన్ఫర్మేషన్ అసంపూర్తిగా నమోదయ్యే అవకాశం ఉంది. తద్వారా ఫైన్ కూడా భరించాల్సి ఉంటుంది.

Similar News

News October 14, 2024

రాడార్ స్టేషన్ ఏర్పాటుకు BRS వ్యతిరేకం: KTR

image

TG: దామగుండం అడవుల్లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి BRS వ్యతిరేకమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పష్టం చేశారు. CM ఓవైపు మూసీకి మరణశాసనం రాస్తూ, మరోవైపు సుందరీకరణ చేస్తారా అని ప్రశ్నించారు. 10ఏళ్ల పాలనలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి తమపై ఎంత ఒత్తిడి తెచ్చినా తాము అంగీకరించలేదని కేటీఆర్ వెల్లడించారు. దీనికి వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి BRS పోరాటం చేస్తుందన్నారు.

News October 14, 2024

CATను ఆశ్రయించిన ఐఏఎస్‌లు

image

ఏపీ క్యాడర్ ఐఏఎస్‌లు ఆమ్రపాలి, కరుణ, వాణి ప్రసాద్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT)ను ఆశ్రయించారు. ఏపీకి వెళ్లేందుకు తాము సిద్ధంగా లేమని, TGలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. DOPT ఉత్తర్వులను రద్దు చేయాలని క్యాట్‌లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఈనెల 16లోపు ఏపీలో రిపోర్టు చేయాలని వీరిని డీవోపీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే.

News October 14, 2024

స్పెషల్ బస్సుల్లోనే ధరలు పెంచాం: సజ్జనార్

image

బస్సు ఛార్జీలు పెంచినట్లు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని TGSRTC ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. 2003లో జీవో- 16 ప్రకారం స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ‘రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. ర‌ద్దీకి అనుగుణంగా ప్ర‌తి రోజు 500 స్పెష‌ల్ బ‌స్సులను సంస్థ న‌డుపుతోంది. వీటిలో మాత్రమే ఛార్జీలు పెంచాం. మిగతా రోజుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయి’ అని స్పష్టం చేశారు.