News May 30, 2024

అలా స్టిక్కర్లు వేయించుకుంటే బైక్ సీజ్: అద్దంకి సీఐ

image

బైక్ వెనకాల నంబర్ లేకుండా మంత్రి తాలుకా అంటూ స్టిక్కర్లు వేయించుకుంటే వాటిని సీజ్ చేస్తామని అద్దంకి పట్టణ సీఐ కృష్ణయ్య తెలిపారు. పట్టణంలో గొట్టిపాటి రవి మంత్రి తాలూకా అని, మరొకరు అద్దంకి ఎమ్మెల్యే హనిమిరెడ్డి తాలూకా అని బైక్ నంబర్ ప్లేట్లపై పేర్లు రాయించుకుని తిరగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో సీఐ వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News November 28, 2024

రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం రేపు ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం ఉదయం TN-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 4రోజుల పాటు వర్షాలు కురుస్తాయంది. రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.

News November 28, 2024

పెట్లూరు సచివాలయాన్ని తనిఖీ చేసిన మంత్రి స్వామి

image

కొండపి మండలం పెట్లూరులో గ్రామ సచివాలయాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రికార్డుల పరిశీలించి, నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బందిని రేషనలైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. సేవలన్నీ ప్రజలకు సకాలంలో అందించాలని ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు.

News November 28, 2024

టంగుటూరు మహిళ హత్య కేసులో కీలక UPDATE

image

టంగుటూరులో మంగళవారం జరిగిన<<14720727>> హైమావతి హత్య కేసు దర్యాప్తును<<>> పోలీసులు ముమ్మరం చేశారు. మృతురాలి భర్త, ఇతర అనుమానితుల కాల్ డేటాను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోపక్క చుట్టుపక్కల CC కెమెరాలను చెక్ చేస్తున్నారు. అప్పటికీ మిస్టరీ విడకపోతే ఇతర కోణాలలో దర్యాప్తు చేస్తామన్నారు. హైమావతిది పేద కుటుంబం కాబట్టి ఆమెను దొంగలు హత్యచేసే అవకాశాలు తక్కువని పోలీసులు అనుమానిస్తున్నారు.