News May 31, 2024
USలో టీమ్ ఇండియాకు వసతులు కరవు!

టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా వెళ్లిన భారత జట్టుకు వసతులు కరవైనట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ చేయడానికి కూడా కనీస సౌకర్యాలు లేవని సమాచారం. ఈ ఏర్పాట్లపై టీమ్ ఇండియా క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు టాక్. దీనిపై ఇప్పటికే ఐసీసీ స్పందించి సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. అదే నెల 9న పాకిస్థాన్‌తో తలపడనుంది.
Similar News
News April 10, 2026
ఆర్టీసీలో ట్రైనీ ఫలితాలు విడుదల

TGSRTCలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ(MST) పోస్టుల ఫలితాలను TSLPRB రిలీజ్ చేసింది. TST పోస్టులకు 9,377 మంది, MST జాబ్స్‌కు 2,755మంది అర్హత సాధించినట్లు తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో 1:5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు HYD అంబర్‌పేట్ PTCలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించింది. 198 పోస్టుల భర్తీకి మార్చి 29న పరీక్షలు జరిగాయి.
News April 10, 2026
RCB Vs RR.. టాస్ ఆలస్యం

అస్సాంలోని గువాహటిలో జరగాల్సిన RCB-RR మ్యాచ్ టాస్ ఆలస్యంగా పడనుంది. స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. వాన తగ్గాక అంపైర్లు పిచ్‌ను పరిశీలించి టాస్‌పై ప్రకటన చేస్తారు. ఈ నెల 7న రాజస్థాన్-ముంబై మ్యాచ్ సందర్భంగానూ గువాహటిలో భారీ వర్షం కురవడంతో గేమ్‌ను 11 ఓవర్లకు కుదించారు. దీంతో అస్సాంలో మ్యాచులంటే ‘అస్సామే’ అని IPL ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.
News April 10, 2026
మావిగన్‌తో మరుసటి రోజే రాజధాని: సజ్జల

AP: చంద్రబాబు లెక్క ప్రకారం అమరావతి పూర్తి కావాలంటే రూ.2-3 లక్షల కోట్లు కావాలని, అందుకు 30-40 ఏళ్లు పడుతుందని YCP రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ జగన్ సూచించిన మావిగన్‌లో 10% ఖర్చుతో మరుసటి రోజే రాజధాని అవుతుందని చెప్పారు. మావిగన్ ప్రాంతం ఇప్పటికే ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లతో ప్రపంచానికి అనుసంధానమై ఉందని, త్వరలోనే పోర్టు కూడా వస్తుందని తెలిపారు.


