News May 31, 2024
పల్నాడులో షాపులు బంద్.. ఎప్పటినుంచంటే..!

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాల మేరకు జూన్ 2,3,4,5 తేదీలలో షాపులు పూర్తిగా మూసి వేయనున్నట్లు, నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరి కిషోర్ బాబు తెలిపారు. శాంతి భద్రతల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్థులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. శనివారం ఐదు గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి అనంతరం షాపులు మూసి వేయవలసిందిగా కిషోర్ కోరారు.
Similar News
News November 11, 2025
కృష్ణా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

తాడేపల్లి పరిధి సీతానగరంలోని కృష్ణానదిలో మంగళవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. మృతుని వయస్సు సుమారు 30నుండి 34 ఏళ్ల మద్యలో ఉంటుందని మృతుడు నలుపు రంగు ఫ్యాంటు, నీలం రంగు చొక్కా ధరించినట్లు చెప్పారు. మృతుని వివరాలు తెలిస్తే 86888 31364 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుళ్లు.. గుంటూరు పోలీసుల అప్రమత్తం

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత కోసం రైల్వేస్టేషన్, బస్టాండ్, వాణిజ్య సముదాయాలు, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు సంచారం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
News November 11, 2025
గుంటూరు జిల్లా: బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా !

కేంద్ర ఆర్ధిక శాఖ మీ డబ్బు–మీ హక్కు పేరుతో దేశ వ్యాప్త ప్రచారంలో భాగంగా రూపొందించిన పోస్టర్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. జిల్లాలో 7,18,055 రిటైల్ ఖాతాలలో రూ.120 కోట్లు ఉన్నాయని చెప్పారు. 24,221 ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్ ఖాతాలలో రూ. 22.02 కోట్లు , 6,672 గవర్నమెంట్ ఖాతాలలో రూ.7.03 కోట్లు మొత్తం రూ.149.47 కోట్లు అన్ క్లైమ్ద్ డిపోజిట్స్ వున్నాయని అన్నారు.


