News May 31, 2024
MBNR: మళ్లీ భానుడి భగభగలు..

రోహిణి కార్తీలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని పెద్దలు చెప్పిన మాటలు నిజం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 15 రోజులుగా వాతావరణం కూల్‌గా ఉండగా గత మూడు రోజులుగా మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. వారం రోజుల క్రితం పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలలోపే ఉన్నాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీలకు చేరుకున్నాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News February 14, 2026
MBNR: ఈనెల 18న క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 18న అమ్నీల్ ఫార్మా, ఆర్-సొల్యూషన్స్ సంస్థలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ జరగనుంది. 2025-26 బ్యాచ్ ఫార్మసీ, ఎంబీఏ, ఎం.కామ్ విద్యార్థులు అసలు సర్టిఫికెట్లు, రెజ్యూమ్‌తో ఫార్మసీ కాలేజ్ ఆడిటోరియానికి రావాలని ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా. ఎస్.ఎన్. అర్జున్ కుమార్ తెలిపారు. QC, QA, ప్రొడక్షన్ విభాగాల్లో నియామకాలు ఉంటాయి.
News February 14, 2026
పాలమూరు: జాతీయ చీఫ్ వచ్చినా.. ప్రభావం చూపని బీజేపీ!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. MBNRలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, కిషన్ రెడ్డి కూడా ప్రచారం చేసినా బీజేపీ జెండా ఎగరలేదు. ఎంపీ డీకే అరుణ సొంత నియోజకవర్గంలో 37 వార్డుల్లో కేవలం 7 మాత్రమే గెలిచాయి. దీంతో కాషాయ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
News February 14, 2026
MBNR: లెక్కింపు ప్రక్రియ విజయవంతం: ఎస్పీ

పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిందని ఎస్పీ జానకి తెలిపారు. లెక్కింపు కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందన్నారు. వారం రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


