News May 31, 2024

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మళ్లీ థియేటర్లు కళకళ!

image

గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వక థియేటర్లు బోసిపోయి కనిపించాయి. ఎట్టకేలకు ఈరోజు మూడు సినిమాలు రిలీజవడంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ఆనంద్ దేవరకొండ ‘గమ్ గమ్ గణేశా’, కార్తికేయ ‘భజే వాయు వేగం’ సినిమాలు రిలీజయ్యాయి. మూడు సినిమాలు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నాయి. మీకేది నచ్చిందో కామెంట్ చేయండి.

Similar News

News January 7, 2025

కెనడా PM రేసులో భారత సంతతి వ్యక్తులు!

image

పీఎంగా జస్టిస్ ట్రూడో తప్పుకోవడంతో కెనడా తదుపరి ప్రధాని ఎవరనే చర్చ మొదలైంది. రేసులో పలువురు లిబరల్ పార్టీ నేతలతో పాటు భారత సంతతికి చెందిన అనితా ఆనంద్, జార్జ్ చాహల్ ఉన్నారు. అనిత ట్రూడో క్యాబినెట్‌లో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌గా ఉన్నారు. ఆమె పేరెంట్స్‌ తమిళనాడు, పంజాబ్‌కు చెందినవారు. ఇక చాహల్ లిబరల్ పార్టీలో, అక్కడి సిక్కు కమ్యూనిటీలో కీలక నేతగా ఉన్నారు. ట్రూడో గద్దె దిగడంలో కీలకపాత్ర పోషించారు.

News January 7, 2025

నిధులన్నీ కుంభమేళాకేనా.. గంగాసాగర్ మేళాకు ఇవ్వరా?: మమత బెనర్జీ

image

UPలో కుంభ‌మేళాకు వేల కోట్ల నిధులిచ్చే NDA ప్ర‌భుత్వం బెంగాల్‌లో జ‌రిగే గంగాసాగ‌ర్ మేళాకు ఎందుకివ్వదని CM మ‌మ‌తా బెనర్జీ ప్ర‌శ్నించారు. ఒక వైపు మడ అడవులు, మరో వైపు సముద్రం ఉండే గంగాసాగర్‌కు నీటి మార్గంలో చేరుకోవాల‌న్నారు. ఇక్కడ కేంద్రం బ్రిడ్జి నిర్మించకపోవడంతో తమ ప్రభుత్వమే ఆ పని చేస్తోందన్నారు. గంగా న‌ది-బంగాళాఖాతం క‌లిసే చోటును గంగాసాగ‌ర్‌గా పిలుస్తారు. ఇక్కడ ఏటా సంక్రాంతికి జాత‌ర జ‌రుగుతుంది.

News January 7, 2025

జనవరి 07: చరిత్రలో ఈరోజు

image

* 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.
* 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత శాంతా సిన్హా జననం.
* 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు
* 2007: జైపూర్ ఫుట్(కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం(ఫొటోలో)