News May 31, 2024
పొటెన్సీ టెస్ట్ అంటే?
ప్రజ్వల్ రేవణ్ణకు వైద్యులు పొటెన్సీ టెస్ట్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడే సామర్థ్యం నిందితుడికి ఉందా? అని ఈ పరీక్షతో గుర్తిస్తారు. వివిధ వైద్య పద్ధతుల ద్వారా శరీరంలోకి కొన్ని రసాయనాలు పంపి అంగ స్తంభన, సామర్థ్యం, వీర్య విశ్లేషణ చేస్తారు. కానీ ఒత్తిడి, ఊబకాయం, సమస్యలున్న వారికి టెస్ట్‌లో పాజిటివ్ రిజల్ట్ వస్తుందని చెప్పలేము. దీంతో నేర నిర్ధారణకు టెస్ట్ ఒక్కటే ప్రామాణికం కాదని నిపుణుల వాదన.
Similar News
News January 7, 2025
జనవరి 07: చరిత్రలో ఈరోజు
* 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.
* 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత శాంతా సిన్హా జననం.
* 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు
* 2007: జైపూర్ ఫుట్(కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం(ఫొటోలో)
News January 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 7, 2025
నైట్‌క్లబ్ బౌన్సర్ నుంచి ప్రధానిగా.. ట్రూడో నేపథ్యమిదే!
కెనడా PMగా దిగిపోనున్నట్లు <<15083640>>ప్రకటించిన<<>> జస్టిన్ ట్రూడో ఆ దేశ మాజీ ప్రధాని పెర్రె ట్రూడో పెద్ద కుమారుడు. రాజకీయాల్లోకి రాకముందు టీచర్, నైట్‌క్లబ్ బౌన్సర్, స్నోబోర్డ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. 2015లో PMగా బాధ్యతలు చేపట్టి కెనడా రెండో యంగెస్ట్ ప్రధానిగా నిలిచారు. వలసవాదానికి మద్దతు, లింగ సమానత్వాన్ని ప్రోత్సాహించడం వంటి అంశాలు పార్టీలో ఆయనపై వ్యతిరేకతకు కారణమయ్యాయి.