News May 31, 2024

ఏపీ అప్పులపై వివరాలు కోరాం: పురందీశ్వరి

image

AP: కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు తెచ్చిందని BJP రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి ఆరోపించారు. గవర్నర్ నజీర్‌ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరిన ఆమె కేంద్రం నుంచి వచ్చిన నిధులు దారి మళ్లాయని మండిపడ్డారు. మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా చూపి అప్పులు చేశారని ఫైరయ్యారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి తెచ్చిన అప్పుల వివరాలు అడిగినట్లు ఆమె వెల్లడించారు.

Similar News

News January 7, 2025

టెంబా బవుమా సరికొత్త రికార్డ్

image

సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సరికొత్త ఘనత సాధించారు. తొలి 9 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన నాలుగో కెప్టెన్‌గా బవుమా నిలిచారు. ఇప్పటివరకు తన సారథ్యంలో 9 టెస్టులు ఆడి వరుసగా 8 గెలుపొందగా, ఒకటి డ్రా చేసుకున్నారు. పాకిస్థాన్‌పై విజయంతో ఈ ఫీట్ సాధించారు. పెర్సీ చాప్‌మన్ (ENG) తొలి తొమ్మిది మ్యాచులనూ గెలిపించారు. ఆ తర్వాత వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (8 AUS), లిండ్సే హస్సెట్ (8 AUS) ఉన్నారు.

News January 7, 2025

కెనడా PM రేసులో భారత సంతతి వ్యక్తులు!

image

పీఎంగా జస్టిస్ ట్రూడో తప్పుకోవడంతో కెనడా తదుపరి ప్రధాని ఎవరనే చర్చ మొదలైంది. రేసులో పలువురు లిబరల్ పార్టీ నేతలతో పాటు భారత సంతతికి చెందిన అనితా ఆనంద్, జార్జ్ చాహల్ ఉన్నారు. అనిత ట్రూడో క్యాబినెట్‌లో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌గా ఉన్నారు. ఆమె పేరెంట్స్‌ తమిళనాడు, పంజాబ్‌కు చెందినవారు. ఇక చాహల్ లిబరల్ పార్టీలో, అక్కడి సిక్కు కమ్యూనిటీలో కీలక నేతగా ఉన్నారు. ట్రూడో గద్దె దిగడంలో కీలకపాత్ర పోషించారు.

News January 7, 2025

నిధులన్నీ కుంభమేళాకేనా.. గంగాసాగర్ మేళాకు ఇవ్వరా?: మమత బెనర్జీ

image

UPలో కుంభ‌మేళాకు వేల కోట్ల నిధులిచ్చే NDA ప్ర‌భుత్వం బెంగాల్‌లో జ‌రిగే గంగాసాగ‌ర్ మేళాకు ఎందుకివ్వదని CM మ‌మ‌తా బెనర్జీ ప్ర‌శ్నించారు. ఒక వైపు మడ అడవులు, మరో వైపు సముద్రం ఉండే గంగాసాగర్‌కు నీటి మార్గంలో చేరుకోవాల‌న్నారు. ఇక్కడ కేంద్రం బ్రిడ్జి నిర్మించకపోవడంతో తమ ప్రభుత్వమే ఆ పని చేస్తోందన్నారు. గంగా న‌ది-బంగాళాఖాతం క‌లిసే చోటును గంగాసాగ‌ర్‌గా పిలుస్తారు. ఇక్కడ ఏటా సంక్రాంతికి జాత‌ర జ‌రుగుతుంది.