News May 31, 2024
ఎగ్జిట్ పోల్ చర్చలకు కాంగ్రెస్ దూరం

ఎగ్జిట్ పోల్స్ వెలువడే వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. TV ఛానల్స్‌లో జరిగే ఎగ్జిట్ పోల్ చర్చల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు AICC అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. ‘ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. దానికి ముందు TRP కోసం ఊహాగానాలతో జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొనదు. ఫలితాలు వెలువడే రోజు నుంచి పాల్గొంటాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News February 19, 2026
నేడు జైపూర్‌కు.. రేపు ఢిల్లీకి సీఎం

AP: సీఎం చంద్రబాబు ఇవాళ రాజస్థాన్‌లోని జైపూర్‌లో పర్యటించనున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు. సాయంత్రం ఐఏఎస్ అధికారి వికాస్ మర్మట్ వివాహానికి హాజరుకానున్నారు. రాత్రికి జైపూర్‌లోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. 9.30AM నుంచి 4.30PM వరకు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆయన పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.
News February 19, 2026
మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు!

ముస్లిం రిజర్వేషన్లను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. విద్యా సంస్థల అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% కోటాను ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను క్యాన్సిల్ చేసింది. 2014 జులైలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తూ నాటి కాంగ్రెస్-NCP ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. కానీ కోర్టు తీర్పుల కారణంగా రిజర్వేషన్ అమలు కాలేదు. ఆర్డినెన్స్ ల్యాప్స్ అయిపోయింది. తాజాగా ఆ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.
News February 19, 2026
బెండలో పేనుబంకను ఎలా నివారించాలి?

బెండ పంటలో పేనుబంక లక్షణాలను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలను తీసుకోవాలి. లేకుంటే పంట నష్టం తీవ్రంగా ఉంటుంది. పేనుబంక నివారణకు 100 లీటర్ల నీటిలో అజాడిరక్టిన్(3000 PPM) 300ML కలిపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. అయినా ఉద్ధృతి తగ్గకపోతే 100 లీటర్ల నీటిలో థయోమిథాక్సాం 30 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 200mlను కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


