News May 31, 2024
రేపు చరణ్ చేతుల మీదుగా ‘మనమే’ ట్రైలర్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘మనమే’. ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా.. ట్రైలర్‌పై చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. రేపు ఉదయం 11.07 గంటలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారని ప్రకటించింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. జూన్ 7న మూవీ రిలీజ్ కానుంది.
Similar News
News February 20, 2026
ALL TIME HIGH: ఫారెక్స్ నిల్వలు $725.72 బిలియన్లు

భారత ఫారెక్స్ నిల్వలు FEB 13 నాటికి $8.66bn పెరిగి ఆల్ టైం హై $725.72bnకు చేరినట్లు RBI వెల్లడించింది. కరెన్సీ అసెట్స్ (డాలర్, యూరో, పౌండ్, యెన్) $3.55bn ఎగసి $573.60bnకు చేరింది. బంగారం నిల్వల విలువ $4.99bn పెరిగి $128.46bnకు చేరుకుంది. ఇక స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(SDR) $103 మిలియన్లు పెరిగి $18.92bnకు చేరాయి. IMF వద్ద దేశ నిల్వలు $19 మిలియన్లు పెరిగి $4.73bnకు చేరుకున్నాయి.
News February 20, 2026
అసలు కడితే చాలు.. వడ్డీ మాఫీ: CS

AP: SC కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకున్న లబ్ధిదారులకు వాటి చెల్లింపులో GOVT వెసులుబాటు కల్పించింది. NSFDC, NSKFDC పథకాల కింద వాహనాలు, స్వయం ఉపాధి కోసం సంస్థ ₹260CR లోన్ ఇవ్వగా వడ్డీ ₹40CR అయ్యింది. APRలోగా అసలు కడితే వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తామని CS విజయానంద్ ప్రకటించారు. సచివాలయంలో రుణాల రికవరీని సమీక్షించిన ఆయన వసూళ్లపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలన్నారు. ‘మనమిత్ర’పై అవగాహన కల్పించాలన్నారు.
News February 20, 2026
ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్

నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాలో క్యాష్ పేమెంట్స్ ఏప్రిల్ 1 నుంచి నిలిచిపోయే అవకాశం ఉందని PIB వెల్లడించింది. అప్పటి నుంచి ఫాస్టాగ్, UPI ద్వారా మాత్రమే చెల్లింపులు ఉంటాయని తెలిపింది. ఇందుకు తగ్గట్లుగా ప్రయాణికులు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. హైవేలపై అడ్డంకులు లేని ప్రయాణాన్ని కల్పించడం, టెక్నాలజీని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.


