News June 1, 2024
NZB: రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
NZB జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మోర్తాడ్‌కు చెందిన నర్సయ్య(63) ఆర్మూర్ శివారులో లారీ ఢీ కొని మృతి చెందాడు. ఆర్మూర్‌లోని ఇస్సాపల్లికి చెందిన ఆశన్న(65) టిప్పర్ టైర్ కింద పడి మృతిచెందాడు. మోర్తాడ్‌లోని దొన్కల్ వద్ద ఆర్మూర్ నుంచి వస్తున్న లారీ ఢీకొని వినయ్(16) మృతి చెందగా.. మోండోరాలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నాగేంద్ర(25) మృతి చెందాడు.
Similar News
News February 12, 2025
NZB: బావిలో పడి బాలుడి మృతి
నిజామాబాద్ జిల్లాలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం ఇందల్వాయి మండలం డొంకల్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన లక్ష్మణ్(13) మరో ఇద్దరితో కలిసి మేకలు కాయడానికి గ్రామ శివారులోకి వెళ్లారు. బావిలో నీటిని తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు వెళ్లి చూసేసరికి లక్ష్మణ్ మృతి చెందినట్లు వెల్లడించారు.
News February 12, 2025
NZB: టెన్త్ అర్హతతో 42 ఉద్యోగాలు
నిజామాబాద్ డివిజన్‌లో 42 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
చిలుకూరు బాలాజీ అర్చకుడికి దాడిలలో బోధన్ యువకుడు
హిందువులను రక్షించడానికి ఏర్పడిన రామరాజ్యం ఆర్మీ వ్యవహారంలో చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన వెలుగు చూసింది. ఈ రామరాజ్యం ఆర్మీలో బోధన్‌కు చెందిన సాయినాథ్ అరెస్టు వ్యవహారం చర్చనీయాంశమైంది. రంగరాజన్‌పై దాడి ఘటనలు పోలీసులు సాయినాథ్‌ను అరెస్ట్ చేశారు. జిల్లా అధ్యక్షుడిగా 2022 నుంచి పని చేస్తున్నాడు. ఇదే విషయమై ఇంకా ఎవరినైనా బెదిరించాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.