News June 1, 2024

వరంగల్: ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. వరంగల్, MHBD పరిధిలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కాగా ఎవరికే వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ద్వారా గెలుపు ఓటములపై ఓ అంచనాకు రానున్నారు. దీని ద్వారా తీవ్ర ఉత్కంఠకు కొంత తెరపడనుంది. ఓటరు నాడీ తెలియాలంటే ఈనెల 4 వరకు వేచిచూడాల్సిందే.!

Similar News

News September 30, 2024

వినతలను స్వీకరించిన వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ సత్యశారదాదేవి వినతులను స్వీకరించారు. ప్రజావాణి వినతులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వినతులను స్వీకరించారు.

News September 30, 2024

వరంగల్: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
HNK 830 72 1:11
JN 582 117 1:05
BHPL 716 151 1:05
MHBD 2072 263 1:08
MLG 881 125 1:07
WGL 1074 169 1:06

News September 29, 2024

పాలకుర్తి: ఇళ్లు ఖాళీ చేయించడం దారుణం!

image

పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయించడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాధితులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడానికి స్థలం లేకపోవడంతో తన సొంత ఖర్చులతో 20 గ్రామాల్లో భూమి కొనుగోలు చేసి నిరేపేదలకు అందించామన్నారు.