News June 1, 2024
NLR: పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఏటా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అందించే పద్మా పురస్కారాల కోసం క్రీడల్లో అత్యుత్తమ స్థాయిలో రాణించిన అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఆర్కే యతిరాజ్ తెలిపారు. అర్హులైన క్రీడాకారులు www.padmaawards.gov.in వెబ్సైట్లో పొందుపరిచిన మార్గదర్శకాలకు అనుగుణంగా sportsinap@gmail.com మెయిల్ అడ్రస్‌కు ఆగస్టు ఒకటో తేదీలోపు పంపాలని కోరారు.
Similar News
News January 21, 2025
జేఈఈ మెయిన్స్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
ఈ నెల 22వ తేదీ నుంచి జరిగే JEE మెయిన్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ తెలిపారు. కోవూరు మండలం గంగవరంలోని గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్& టెక్నాలజీ, పొట్టేపాలెం ఇయాన్ డిజిటల్ జోన్, తిరుపతి జిల్లా కోటలోని NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలలో పరీక్షలు జరుగుతాయన్నారు.
News January 21, 2025
పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి: కమిషనర్
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని, బకాయిలు చెల్లించని వారి కనెక్షన్లను వెంటనే తొలగించాలని వార్డు సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులను కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. కార్పోరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, టిడ్కో,హౌసింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు, అధికారులతో సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.
News January 20, 2025
నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్‌కు 97 ఫిర్యాదులు
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని ASP సౌజన్య , DTC DSP గిరిధర్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 97 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ మోసాలు, రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.