News June 1, 2024
దాచేపల్లి ఉపాధ్యాయుడిని సన్మానించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం

దాచేపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ మస్తాన్ వలిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం సన్మానించింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న షేక్ మస్తాన్ వలీ గుంటూరులో జరిగిన సభలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిగా మస్తాన్ వలి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News November 12, 2025
గుంటూరు జిల్లాలో టుడే టాప్ న్యూస్

* అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ
* మంగళగిరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
* తెనాలి రైల్వే స్టేషన్‌లో వ్యక్తి హల్చల్
* పొన్నూరు మండలం కసుకర్రు చెరువులో చేపలు మృతి
* జగన్ చేసినదంతా కల్తీనే: పెమ్మసాని
* తెనాలి ఆస్పత్రి ఆవరణలో అనాథగా పడి ఉన్న వృద్ధుడు
* హ్యాండ్ బాల్ పోటీల్లో నారాకోడూరు విద్యార్థుల సత్తా
News November 11, 2025
పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్థ వహించాలి: DEO

పదవతరగతి విద్యార్థులను ప్రణాళికా బద్దంగా చదివించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఉపాధ్యాయులకు సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలోని SKVRN, LMPహైస్కూల్స్ ని మంగళవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా SA-1పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. పది విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి చదివించాలన్నారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.
News November 11, 2025
అయ్యో పాపం.. ఆస్పత్రి ఆవరణలో అనాధగా పడి ఉన్న వృద్ధుడు

తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఓ వృద్ధుడు అనాధగా దీన స్థితిలో పడి ఉన్నాడు. ఎక్కడ నుంచి వచ్చాడో తెలీదు కానీ ఆస్పత్రి ప్రాంగణంలో ఆరు బయట నీరసించి పడి ఉండటం చూపురులను కలచివేస్తోంది. అనారోగ్యంతో బక్కచిక్కి ఉన్న ఆయన పరిస్థితి చూసి అటుగా వెళుతున్న వారు అయ్యో పాపం అంటున్నారే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. వృద్ధుడికి యూరిన్ పైప్ అమర్చి ఉందని, మాట్లాడే స్థితిలో కూడా లేడని స్థానికులు చెబుతున్నారు.


