News June 1, 2024
కాంగ్రెస్ 9-12 సీట్లు గెలవబోతుంది: మంత్రి కోమటిరెడ్డి
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ 9-12 లోక్‌సభ సీట్లు గెలవబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 4 తర్వాత BRS పార్టీయే ఉండదని మీడియా సమావేశంలో తెలిపారు. సోనియాపై విమర్శలు చేసిన KCRకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్ర చిహ్నంపై BRS నేతలు అనవసరమైన వివాదం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News January 21, 2025
6.83 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనాలు
AP: తిరుమలలో పది రోజుల పాటు శ్రీవారిని 6,83,304 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హుండీ ద్వారా రూ.34.43కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ అత్యధికంగా 78 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపింది. ఆదివారం అర్ధరాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియగా, సోమవారం తెల్లవారుజాము నుంచి సాధారణ దర్శనాలను టీటీడీ ప్రారంభించింది.
News January 21, 2025
RTCకి సంక్రాంతి ఆదాయం రూ.115కోట్లు!
TG: సంక్రాంతి సందర్భంగా నడిపిన స్పెషల్ బస్సుల ద్వారా ఆర్టీసీకి కాసుల వర్షం కురిసినట్లు సమాచారం. 6వేల ప్రత్యేక బస్సుల ద్వారా అనధికార లెక్కల ప్రకారం రూ.115 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది 5వేల బస్సులు నడపగా, రూ.99కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ నెల 10-12, 19,20 తేదీల్లో TGSRTC బస్సుల్లో 50శాతం వరకు ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో అధికారిక లెక్కలు వెలువడనున్నాయి.
News January 21, 2025
నేటి నుంచి దరఖాస్తులకు మరో అవకాశం
TG: రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుంచి ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా ఆయా గ్రామాలకు చేరింది. తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి అవకాశమివ్వాలని సర్కారు నిర్ణయించింది. అలాంటివారి నుంచి గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది.