News June 1, 2024
లెక్కింపు ప్రక్రియలో 10 వేల మంది సిబ్బంది: వికాస్ రాజ్
TG: ఈ నెల 4న ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగంచెల భద్రత ఉంటుందని CEO వికాస్ రాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కౌంటింగ్ హాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని పునరుద్ఘాటించారు. లెక్కింపు ప్రక్రియలో దాదాపు 10 వేల మంది సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు. ETPBS(ఆర్మీ, పారా మిలిటరీ) ఓట్లు ఇంకా వస్తున్నాయని, జూన్ 4 ఉదయం 8 గంటల వరకు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
Similar News
News January 21, 2025
ఆ పెన్షన్ దారులందరికీ వైద్య పరీక్షలు
AP: దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, చేతులు దెబ్బతినడంతో రూ.6వేలు పెన్షన్ పొందుతున్నవారికి ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. రాష్ట్రంలోని సుమారు 7లక్షల మంది లబ్ధిదారుల్లో 40% అనర్హులు ఉండొచ్చని అంచనా. అవయవాలు బాగానే ఉన్నా ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్లూ డబ్బులు తీసుకున్నవారి పెన్షన్ కట్ కానుంది.
News January 21, 2025
6.83 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనాలు
AP: తిరుమలలో పది రోజుల పాటు శ్రీవారిని 6,83,304 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హుండీ ద్వారా రూ.34.43కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ అత్యధికంగా 78 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపింది. ఆదివారం అర్ధరాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియగా, సోమవారం తెల్లవారుజాము నుంచి సాధారణ దర్శనాలను టీటీడీ ప్రారంభించింది.
News January 21, 2025
RTCకి సంక్రాంతి ఆదాయం రూ.115కోట్లు!
TG: సంక్రాంతి సందర్భంగా నడిపిన స్పెషల్ బస్సుల ద్వారా ఆర్టీసీకి కాసుల వర్షం కురిసినట్లు సమాచారం. 6వేల ప్రత్యేక బస్సుల ద్వారా అనధికార లెక్కల ప్రకారం రూ.115 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది 5వేల బస్సులు నడపగా, రూ.99కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ నెల 10-12, 19,20 తేదీల్లో TGSRTC బస్సుల్లో 50శాతం వరకు ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో అధికారిక లెక్కలు వెలువడనున్నాయి.