News June 1, 2024
ADB: రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత లేదు: వ్యవసాయశాఖ డైరెక్టర్
రాష్ట్రంలో పత్తివిత్తనాల కొరత లేదని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి అన్నారు. ఆదిలాబాద్‌లో రాశి కాటన్ సీడ్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉండటం, సరిపడా విత్తనాలు లేకపోవడంతో గందరగోళం ఏర్పడిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తమిళనాడు నుంచి 30 వేల ప్యాకెట్లను తెప్పించి ఆదిలాబాద్ పంపించినట్టు ఆయన తెలిపారు. మరో 4, 5 రోజుల్లో 40 వేల ప్యాకెట్లను అందుబాటులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News November 17, 2024
ఉట్నూర్: ఆవుపై దాడి చేసిన పెద్దపులి
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో పెద్దపులి కలకల రేపుతోంది. తాజాగా శనివారం సాయంత్రం ఉట్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామ పంచాయతీలోని వంక తుమ్మ గ్రామ సమీపంలో ఓ ఆవుపై దాడి చేసింది. దీంతో ఆవు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News November 16, 2024
నార్నూరు: కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
కొడుకును తండ్రి కత్తితో పొడిచిన ఘటన నార్నూర్ మండలంలోని గుంజల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం గుంజాల గ్రామానికి చెందిన మేస్రం భుజంగరావు కుటుంబ తగాదాల కారణంగా తన కొడుకు బాలాజీని కత్తితో పొడిచాడు. స్థానికులు గమనించి బాలాజీని ఉట్నూర్ తరలించారు. కాగా అక్కడి వైద్యులు రిమ్స్ కు రిఫర్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 16, 2024
మంచిర్యాల: భార్యాభర్తలను ఢీకొన్న అంబులెన్స్.. భర్త మృతి
గద్దెరాగడి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కోట సాంబశివరావు తన భార్య శివపార్వతితో కలిసి శుక్రవారం బైక్ పై మంచిర్యాలకు వెళ్తుండగా అంబులెన్స్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం MNCLకు, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. మార్గ మధ్యలోనే సాంబశివరావు మృతి చెందినట్లు SI రాజశేఖర్ వెల్లడించారు. కాగా వారు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల నుంచి 15 ఏళ్ల క్రితం మందమర్రికి వలస వచ్చారు.