News June 1, 2024

MBNR: సైబర్ మోసం రూ.2.58 లక్షలు మాయం

image

ఓ వ్యక్తి వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్ చేయగా రూ.లక్షలు పొగొట్టుకున్నాడు. రాజోళి మండల కేంద్రానికి చెందిన ఎల్లప్ప వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ను ఓపెన్ చేశాడు. అందులో సూచించిన విధంగా నమోదు చేస్తూ వెళ్లగా, తనకు చెందిన మూడు క్రెడిట్ కార్డుల నుంచి రూ.2.58లక్షలు మాయమైనట్లు గ్రహించాడు. ఆందోళనకు గురైన ఆ వ్యక్తి సైబర్‌ క్రైం‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. శుక్రవారం రాజోలి పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Similar News

News May 7, 2025

MBNR: ఇళ్ల ముందు నిలిపిన బైక్‌లే వారి టార్గెట్..!

image

MBNR, GDWL, NGKL, WNP, NRPT జిల్లాల్లో ఇళ్ల ముందు నిలిపిన పలు బైక్‌లను రాత్రిళ్లు చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాల ఎస్ఐ కళ్యాణ్ తెలిపిన వివరాలు.. గద్వాల వాసి వంశీ, మరో ఏడుగురు కలిసి బైక్‌లను చోరీ చేసేవారు. గతంలో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 35బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వంశీని శుక్రవారం ధరూర్‌మెట్‌లో అరెస్ట్ చేసి మరో 5 బైక్‌లను సీజ్ చేశారు.

News April 25, 2025

మరో 3 రోజుల్లో పాలమూరు యూనివర్సిటీ పరీక్షలు 

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని UG 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, 5 బ్యాక్ లాగ్ పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈనెల 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా మరో 3 రోజులే మిగిలి ఉంది. వివరాలకు www.palamuruuniversity.com వెబ్‌సైట్ చూడండి. ఇక ఫీజు రియంబర్స్‌మెంట్ కోసం PU పరిధిలోని MBNR, GDWL, NGKL, WNP, NRPTలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. SHARE IT

News April 25, 2025

గద్వాల: యువకుడి ఆత్మహత్య.. కేసు నమోదు

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లి PS పరిధిలో జరిగింది. SI మహేశ్ తెలిపిన వివరాలు.. బొంకూరు గ్రామ వాసి K.మధు(34) బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. అనంతరం తనకు తెలిసిన వ్యక్తి రాముడికి ఫోన్ చేసి ‘మా తాతల ఆస్తి నాకు సరిగా పంచలేదు.. అందుకే పొలం వద్ద పురుగు మందు తాగి చనిపోతున్నా’ అని చెప్పాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. కేసు నమోదైంది.

error: Content is protected !!