News June 1, 2024
ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. శనివారం జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్ మండలం కోల్వైలో 45.5°C, ధర్మపురి మండలం జైనలో 45.3°C, కోరుట్ల మండలం ఐలపూర్ లో 45.0°C, రాయికల్ మండలం ఆల్లిపూర్‌లో 44.7°C, కోరుట్లలో 44.3°C, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట్ లో 44.6°C, కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం ఈదులగట్టుపల్లిలో 43.6°C, పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో 42.7°C ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News January 17, 2026
కరీంనగర్ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు

KNR కార్పొరేషన్ 66 వార్డుల రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్టీ జనరల్: 28
ఎస్సీ మహిళ: 27, 30, 53
ఎస్సీ జనరల్: 4, 20, 25, 29
బీసీ మహిళ: 1, 5, 17, 33, 35, 43, 45, 47, 48, 54, 62, 64
బీసీ జనరల్: 10, 14, 31, 32, 34, 36, 37, 39, 46, 58, 59, 61, 63
జనరల్ మహిళ: 3, 7, 9, 11, 12, 13, 15,19, 38, 40, 41, 44, 49, 52, 55, 56, 57, 60
జనరల్: 2, 6, 8, 16, 18, 21, 22, 23, 24, 26, 42, 50, 51, 65, 66
News January 17, 2026
కరీంనగర్: చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి: కలెక్టర్

స్థానిక బాల సదనంకు చెందిన తొమ్మిది, పన్నెండేళ్ల వయసున్న ఇద్దరు బాలికలను హైదరాబాద్‌కు చెందిన దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంతానం లేని వారు చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు జిల్లా సంక్షేమ అధికారిని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News January 17, 2026
KNR: ఈనెల 20న అప్రెంటిస్‌షిప్ ఇంటర్వ్యూలు

జహీరాబాద్, సంగారెడ్డిలోని మహీంద్రా సంస్థలో 300 అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి ఈ నెల 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులై, 18-25 ఏళ్ల వయసున్న కరీంనగర్ జిల్లా గ్రామీణ యువత దీనికి అర్హులు. ఆసక్తి గలవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో కరీంనగర్‌లోని స్వశక్తి కళాశాలలోని ఈజీఎంఎం కార్యాలయంలో హాజరుకావాలని ఆయన సూచించారు.


