News June 1, 2024

తూ.గో.: ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్: SP

image

ఈ నెల 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు కొత్త నిబంధన విధించారు. ఏజెంట్లకు ఎన్నడూ లేని విధంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే.. కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి నిరాకరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

Similar News

News September 28, 2024

రాజమండ్రి: చిరుత కనిపించలేదు: DFO

image

కడియం మండలం బుర్రిలంక పరిసరాల్లో అమర్చిన ట్రాప్, సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు ఇంకా గుర్తించలేదని, పాదముద్రలు కూడా కనిపించలేదని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి శనివారం తెలిపారు. దివాన్ చెరువు ప్రాంతంలో కూడా ఏ విధమైన సమాచారం లభించలేదన్నారు. బుర్రిలంక సమీపంలోని గోదావరి లంకల్లో జింకలు ఉన్న నేపథ్యంలో చిరుత అటు వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. రేపటి నుంచి ఆ ప్రాంతాల్లో గాలిస్తామన్నారు.

News September 28, 2024

తూ.గో.: పిడుగు పడతాయి జాగ్రత్త

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని కోనసీమ, కాకినాడ రూరల్, తుని, సామర్లకోట, పెద్దాపురం, రాజమండ్రి, అనపర్తి తదితర ప్రాంతాల్లోని ప్రజల సెల్‌ఫోన్లకు సందేశాలు పంపించారు.

News September 28, 2024

రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలకు మండపేట విద్యార్థులు

image

రాయవరం, కాకినాడలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ ఆటల పోటీల్లో మండపేటకు చెందిన విద్యార్థులు వివిధ విభాగాల్లో ఉత్తమ క్రీడా ప్రతిభను కనబరిచి రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మీ శ్రీనివాస్ శనివారం తెలిపారు. కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి అండర్-14, 17 విభాగాల్లో టెన్నికాయట్ లో బల్ల సత్యనారాయణ, కే.శివశంకర్ ప్రసాద్, ఖండవల్లి చైతన్యలు ఎంపికయ్యారు.