News June 1, 2024

తెలంగాణలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్: TV9 సర్వే

image

తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ కేవలం ఒకే స్థానానికి పరిమితం కావచ్చని TV9 చెబుతోంది. ఇక కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేస్తోంది. ఇదే సమయంలో గత లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు పొందిన బీజేపీ ఈసారి 7 చోట్ల గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్ రిజల్ట్ వెల్లడించింది. హైదరాబాద్ స్థానంలో అసదుద్దీన్ గెలుస్తారని అంచనా వేస్తోంది.

Similar News

News February 21, 2026

క్రిస్ క్యాపిటల్ చేతికి నోవార్టిస్

image

స్విస్ హెల్త్‌కేర్ దిగ్గజం ‘నోవార్టిస్ ఏజీ’ భారత్‌లో వ్యాపారానికి ఫుల్‌స్టాప్ పెట్టనుంది. నోవార్టిస్ ఇండియా లిమిటెడ్‌లో ఉన్న 70.68% వాటాను క్రిస్ క్యాపిటల్‌కు విక్రయించనుంది. దీని విలువ రూ.1,446 కోట్లు కాగా ఈ ఏడాది చివరి నాటికి డీల్ పూర్తి కానుంది. దీంతో నోవార్టిస్‌లోని 26% వాటా కొనుగోలుకు క్రిస్ క్యాపిటల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. అందుకు షేరుకు రూ.860.64 చొప్పున రూ.552 కోట్లు వెచ్చిస్తోంది.

News February 21, 2026

గర్భసంచి కిందికి ఎందుకు జారుతుందంటే?

image

మహిళల్లో పెల్విక్ ఫ్లోర్ కండరాలు, స్నాయువులు గర్భశయానికి సపోర్ట్ ఇవ్వనప్పుడు, ఎక్కువగా సాగి, బలహీనమైనప్పుడు గర్భాశయ ప్రోలాప్స్ వస్తుంది. ఈ సమయంలో గర్భాశయం యోనిలోకి ప్రవేశించడం, పొడుచుకు రావడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెనోపాజ్, ఎక్కువ సాధారణ ప్రసవాలు జరిగితే ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యకి ట్రీట్‌మెంట్ అనేది మహిళ సమస్య, ఆమె వయసు, ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది.

News February 21, 2026

ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం: KTR

image

TG: SLBC సొరంగం కూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందని KTR విమర్శించారు. ‘మృతదేహాల వెలికితీతలో, సొరంగం పనుల్లో పురోగతి లేకపోవడం రేవంత్ చేతకానితనానికి నిదర్శనం. కాంగ్రెస్ నేతలు కమీషన్లపై పెట్టే శ్రద్ధ.. ప్రజా శ్రేయస్సుపై పెడితే ఇలాంటి విషాదాలు పునరావృతం కావు’ అని ట్వీట్ చేశారు. 2025 FEB 22న జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.