News June 1, 2024
కేంద్రంలో బీజేపీదే అధికారం: జన్ కీ బాత్

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగిస్తుందని జన్ కీ బాత్ సర్వే ప్రకటించింది. ఎన్డీఏ-377, ఇండియా కూటమి-151, ఇతరులు-15 సీట్లు సాధిస్తాయని అంచనా వేసింది. ఇటు మ్యాట్రిజ్ సంస్థ.. ఎన్డీఏ-353-368, ఇండియా కూటమి- 118-133, ఇతరులు- 43-48 సాధిస్తాయని వెల్లడించింది.
Similar News
News November 10, 2025
రష్యా భయంతో రక్షణ వ్యయాన్ని పెంచుతున్న EU దేశాలు

రష్యా దాడి భయంతో యూరోపియన్ దేశాలు తమ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుకుంటున్నాయి. తాజాగా జర్మనీ $1.2Bతో ఎయిర్ బస్ నుంచి 20 మిలటరీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆర్డరిచ్చింది. 2027 నాటికి ఇవి అందనున్నాయి. ఇప్పటికే అది 62 H145M హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. కాగా సాయుధ దళాల అత్యవసర ఆధునీకరణ కోసం జర్మనీ ఈ ఏడాదిలో ప్రత్యేక నిధినీ ఏర్పాటు చేసింది. ఈ ఆర్డర్లతో అనేక ఆయుధ తయారీ సంస్థలు ప్రయోజనాలు పొందుతున్నాయి.
News November 10, 2025
అత్యాచార బాధితురాలిపై లాయర్ ఘాతుకం

గ్యాంగ్ రేప్ బాధితురాలిపై అత్యాచారం చేశాడో లాయర్. UPలోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. 2022లో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసును కోర్టు బయట సెటిల్ చేస్తానని నిందితుల్లో ఒకరి లాయర్ జితేంద్ర సింగ్ యువతి(24)ని నమ్మించాడు. హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడి నుంచి విడిపించుకుని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడు ఇంటిపై నుంచి దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి.
News November 10, 2025
NSUTలో 176 పోస్టులు.. అప్లై చేశారా?

ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (<


