News June 1, 2024
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే.?: కేకే సర్వే
ఉమ్మడి గుంటూరులో జిల్లాలోని 17 సీట్లలో వైసీపీ ఖాతా తెరిచే అవకాశం లేదని కేకే సర్వే పేర్కొంది. టీడీపీకి 16 సీట్లు వస్తాయని చెప్పింది. జనసేనకు 1 సీటు వస్తుందని పేర్కొంది. మంత్రులుగా చేస్తున్న రజిని, అంబటి రాంబాబు గెలుపు అవకాశాలు తక్కువని స్పష్టం చేసింది. ఈ ఎగ్జిట్ పోల్‌పై మీ COMMENT.
Similar News
News November 17, 2024
ప్రభుత్వంలోని మంచి, చెడులను వెలికి తీయాలి: మంత్రి
మంగళగిరి: జర్నలిస్టులు ప్రభుత్వంలో జరుగుతున్న మంచి, చెడులను విచక్షణారహితంగా వెలుగులోకి తీసుకురావాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ రచయిత ఈపురి రాజారత్నం రచించిన ‘జర్నలిజం జర్నలిస్టుల బేసిక్స్’ పుస్తకాన్ని ఆయన శనివారం సచివాలయంలో ఆవిష్కరించారు. పలువురు జర్నలిస్టులు మస్తాన్ రావు, బత్తుల సాంబశివరావు, ఎస్‌కె రఫీ పాల్గొన్నారు.
News November 16, 2024
గుంటూరు: జాతీయ రహదారిపై మూడు లారీలు ఢీ.. ఇద్దరు మృతి
గుంటూరు నగర శివారు నల్లపాడు స్టేషన్ పరిధిలోని బుడంపాడు సమీపంలోని జాతీయ రహదారిపై మూడు లారీలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. మరమ్మతులకు గురైన కార్ల కంటైనర్‌ను ప్లేవుడ్ లోడ్‌తో వెళ్తున్న లారీ, ప్లేవుడ్ లోడ్ లారీని ఐచర్ లారీ ఢీకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 16, 2024
రెంటచింతల: కృష్ణా నదిలో దంపతులు గల్లంతు
కృష్ణానదిలో కార్తీక స్నానం చేయడానికి వెళ్లిన దంపతులు గల్లంతైన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన నీలా సత్యనారాయణ, పద్మావతిలు శనివారం కార్తీక స్నానమాచరించడానికి సత్రశాల వెళ్లినట్లు వారి బంధువులు తెలిపారు. భార్య పద్మావతి నీటిలోకి జారిపోవడంతో ఆమెను కాపాడేందుకు భర్త వెళ్లాడన్నారు. జాలర్లు పద్మావతి మృతదేహాన్ని వెలికి తీశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.