News June 1, 2024

గుంటూరు జిల్లాలో టీడీపీకి 13 సీట్లు: చాణక్య స్ట్రాటజీస్ సర్వే

image

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు గానూ కూటమికి 13, వైసీపీ 3 చోట్ల విజయం సాధించనుండగా.. ఒక చోట టఫ్ ఫైట్ ఉండనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేపై మీ COMMENT.

Similar News

News November 3, 2025

ప్రతీగ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలి: కలెక్టర్

image

ప్రతి గ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నీరు, పారిశుద్ధ్య కమిటీ సమావేశం సమావేశం జరిగింది. పారిశుద్ద్య నిర్వహణకు పెద్ద పీట వేయాలని, ఎక్కడా బహిరంగ మల విసర్జన లేకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. బహిరంగ మల విసర్జన రహిత (ఓ.డి.ఎఫ్) గ్రామాలుగా గతంలో ప్రకటించిన గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి పరిస్థితులను గమనించాలన్నారు.

News November 3, 2025

GNT: 4న పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ రాక

image

రాష్ట్ర శాసనసభా పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఈ నెల 4న గుంటూరు జిల్లాలో పర్యటిస్తుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్‌కి చేరుకుంటుందని చెప్పారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ కార్యకలాపాలను సమీక్షిస్తుందన్నారు. 2.30 ని.ల నుంచి ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ అంశాల పై సమీక్ష ఉంటుందన్నారు.

News November 2, 2025

GNT: భక్తులకు ఊరట.. అనుమతి ఇచ్చే అవకాశం?

image

బాపట్ల సూర్యలంక బీచ్‌ను నవంబర్ 3, 4 తేదీలలో (సోమవారం, మంగళవారం) తాత్కాలికంగా మూసివేసినట్లు RDO తెలిపారు. మెుంథా తుఫాను ప్రభావం వలన సముద్ర స్నానం చేయు ప్రాంతంలో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నందున బీచ్‌ని మూసివేసినట్లు తెలిపారు. తదుపరి భద్రతా పరిశీలన చేసి ప్రకటన ఇచ్చేవరకు మూసివేయడమైనదని ఆయన తెలిపారు. కాగా కార్తీక పౌర్ణమికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.