News June 1, 2024

PL SURVEY: సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి BJPదే!

image

HYDలో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరిలో BJP గెలుస్తుందని పొలిటికల్ ల్యాబొరేటరీ (PL) సర్వే అంచనా వేసింది. చేవెళ్లలో BRS నుంచి కాసాని, కాంగ్రెస్- రంజిత్ రెడ్డి, BJP- కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. మల్కాజిగిరిలో BRS-రాగిడి, కాంగ్రెస్-సునీత, BJP-ఈటల పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్‌లో BRS-పద్మారావు, కాంగ్రెస్- దానం నాగేందర్, BJP-కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు.

Similar News

News January 23, 2025

ఓయూలో పీజీ దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల

image

ఓయూలో దూరవిద్య పరిధిలోని వివిధ పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శశికాంత్‌ తెలిపారు. M Com, MA, Msc తదితర కోర్సుల మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News January 22, 2025

అర్హుల ఎంపికకే గ్రామసభలు: MRO జయరాం.!

image

అర్హుల ఎంపికకే గ్రామసభలు నిర్వహింస్తున్నామని MRO జయరాం అన్నారు. నవాబ్‌పేట్ మండలంలోని మీనేపల్లికలాన్, ముబారక్‌పూర్ గ్రామాలల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో MRO పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 24 వరకు గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. అర్హత ఉండి జాబితాలోలేని వారి గురించి ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్​లో మళ్లీ దరఖాస్తులను స్వీకరించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తుది జాబితాను రూపొందిస్తామన్నారు.

News January 22, 2025

VIRAL: MLA పద్మారావు లేటెస్ట్ ఫొటో

image

సికింద్రాబాద్ MLA T.పద్మారావు గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనులతో ఆయన ఆదివారం డెహ్రాడూన్ వెళ్లారు. ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు స్టంట్ వేసి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. అయితే, డెహ్రాడూన్‌లోని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పద్మారావు కోలుకున్నారని, ఆస్పత్రిలో కుటుంబీకులతో దిగిన ఫొటోలను బీఆర్ఎస్ శ్రేణులు షేర్ చేస్తున్నాయి.