News June 2, 2024

విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న మెదక్ కలెక్టరేట్ 

image

మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబైంది. ఈసందర్భంగా కలక్టరేట్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ కాంతుల్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News March 4, 2026

మెదక్: ఇంటర్ పరీక్షలకు 98.21% హాజరు

image

మెదక్ జిల్లాలో ఆరో రోజు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. బాటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్-IIA పరీక్షలకు మొత్తం 98.21 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,017 మందికి గాను 4,932 మంది, ఒకేషనల్ విభాగంలో 541 మందికి గాను 527 మంది పరీక్ష రాశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆమె పేర్కొన్నారు.

News March 4, 2026

మెదక్: కలెక్టర్‌ను కలిసిన అడిషనల్ ఎస్పీ

image

మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను అడిషనల్ ఎస్పీ మహేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యల గురించి ఆమెకు వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

News March 3, 2026

మెదక్: సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.