News June 2, 2024
సునీత అంతరిక్షయానం మళ్లీ వాయిదా
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షయానం మరోసారి వాయిదా పడింది. ఆమె ప్రయాణించాల్సిన బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తింది. దీంతో లాంచ్‌కు మరో మూడు నిమిషాలు ఉందనగా ప్రయోగం నిలిచిపోయింది. వ్యోమగాములు సునీత, విల్మర్ సురక్షితంగా బయటకొచ్చారు. ఇలా బోయింగ్ స్టార్‌లైనర్ ప్రయోగం ఆగిపోవడం ఇది రెండోసారి. మే 7న కూడా సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం వాయిదా పడింది.
Similar News
News January 21, 2025
సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాసేపటి క్రితం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. జనవరి 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండగుడు కత్తితో దాడి చేశాడు.
News January 21, 2025
PHOTOS: ఫ్యామిలీతో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో దిగిన కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భార్య స్నేహా రెడ్డితో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ వైట్ టీషర్టు ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. మొన్నటి వరకు ‘పుష్ప-2’ సినిమా కోసం హెయిర్, బియర్డ్ పెంచిన బన్నీ.. తాజాగా తన లుక్‌ను మార్చేసిన విషయం తెలిసిందే. కాగా, మార్చి నెల నుంచి త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో సినిమా ప్రారంభం కానుంది.
News January 21, 2025
భారత్‌తో తొలి T20.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
భారత్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రేపు జరిగే తొలి T20 కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, సాల్ట్(కీపర్), డక్కెట్, బ్రూక్, లివింగ్ స్టోన్, బెథెల్, ఓవర్టన్, అట్కీన్‌సన్, అర్చర్, రషీద్, వుడ్ జట్టులో ఉండనున్నారు. ఈ మేరకు జట్టును కోచ్ మెక్‌కల్లమ్ ప్రకటించారు.