News June 2, 2024
ఇవాళ స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక ఫలితాలు
TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ MLC ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 1,439 ఓట్లలో 1,437 పోలయ్యాయి. ఈ ఎన్నికలో మన్నె జీవన్‌రెడ్డి(కాంగ్రెస్), నవీన్‌కుమార్ రెడ్డి(బీఆర్ఎస్), సుదర్శన్ గౌడ్(స్వతంత్ర) పోటీ చేశారు. MLC కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.
Similar News
News January 15, 2025
ప్రేమించిందని పోలీసుల ముందే కూతురిని చంపిన తండ్రి
MPకి చెందిన మహేశ్ గుర్జార్ తన కూతురు తనూ(20)కు మరో 4 రోజుల్లో పెళ్లి జరిపించాలని నిర్ణయించాడు. ఇంతలో తాను విక్కీ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతడిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబీకులు ఒప్పుకోవడంలేదంటూ తనూ SMలో ఓ వీడియో పెట్టింది. విషయం పోలీసులకు, గ్రామస్థులకు తెలియడంతో నచ్చజెప్పేందుకు పంచాయితీ పెట్టారు. ఈక్రమంలోనే తండ్రీకూతురు మధ్య వాగ్వాదం జరగడంతో అందరి ముందే తనూను మహేశ్ కాల్చి చంపాడు.
News January 15, 2025
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు-2025
*మే 12న ఈసెట్
*జూన్ 1న ఎడ్‌సెట్
*జూన్ 6న లాసెట్, పీజీ లా సెట్
*జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్
*జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్
News January 15, 2025
ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు అలర్ట్.. EAPCET తేదీలు వచ్చేశాయ్
TG: ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బీటెక్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే EAPCETను ఏప్రిల్ 29 నుంచి నిర్వహిస్తామని తెలిపింది. APR 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఈ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.