News June 2, 2024

తూ.గో.: నెలాఖరు వరకు రెండు రైళ్లు రద్దు

image

ట్రాఫిక్ నిర్వహణ పనుల నిమిత్తం శనివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 2 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం తెలిపారు. రాజమహేంద్రవరం- విజయవాడ (07767), విజయవాడ- రాజమహేంద్రవరం (07459) రైళ్లు ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండవని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
– SHARE IT

Similar News

News November 12, 2025

తూ.గో: ఎక్కడ ఎన్ని ఇళ్లంటే..!

image

తూ.గో జిల్లాలో 8,773 ఇళ్లలో గృహప్రవేశాలు బుధవారం జరగనున్నాయి. పీఎంఏవై బీఎల్సీ పథకం కింద 7,200, పీఎంఏవై గ్రామీణ పథకం కింద 1,573 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని హౌసింగ్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాతి బుజ్జి తెలిపారు. రాజమండ్రిలో 375 ఇళ్లు, రాజానగరంలో 631, గోపాలపురంలో 1,760 ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు.

News November 11, 2025

తూ.గో: హోం స్టే పెడితే రూ.5లక్షలు

image

తూ.గో జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో కనీసం ఓ గది నుంచి గరిష్ఠంగా 6గదులతో హోం స్టే ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ‘కొత్తగా పెట్టేవారికి స్వదేశ దర్శన్ పథకం కింద రూ.5 లక్షల ప్రోత్సాహకం ఇస్తాం. పాత హోమ్ స్టే పునరుద్ధరణకు రూ.3లక్షల వరకు సాయం చేస్తాం. 7ఏళ్లు 100 శాతం SGST తిరిగి చెల్లిస్తాం. మొదటి మూడేళ్లు రిజిస్ట్రేషన్ ఉచితం. యజమాని అదే ఏరియాలో ఉండాలి’ అని కలెక్టర్ చెప్పారు.