News June 2, 2024
చిత్తూరు: రేపటి నుంచి మద్యం విక్రయాలు బంద్

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం విక్రయాలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 3, 4, 5వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ జిల్లా అధికారి ఆయేషాబేగం తెలిపారు. ఎక్కడా మద్యం విక్రయాలు జరగవని పేర్కొన్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో శనివారం కూడా జిల్లాలో మద్యం దుకాణాలు మూసేశారు.
Similar News
News January 23, 2026
చిత్తూరు జిల్లాలో భూ సమస్యలే ఎక్కువ..!

చిత్తూరు జిల్లాలో ప్రతి సోమవారం జరిగే కలెక్టర్ గ్రీవెన్స్ డేకు అర్జీలు భారీగా వస్తున్నాయి. డిసెంబర్, జనవరి 19వ తేదీ వరకు ఒక్క రెవెన్యూ శాఖపైనే 1,238 అర్జీలు అందాయి. డిసెంబర్‌లో 742 ఫిర్యాదులకు 638 పరిష్కరించి, 78 రిజెక్ట్ చేశారు. 26 పెండింగ్‌లో ఉన్నాయి. జనవరిలో 496 మంది భూ సమస్యలపై అర్జీలు ఇవ్వగా 290 పరిష్కరించి, 42 రిజెక్ట్ చేయగా.. 164 అర్జీలు పరిష్కరించాల్సి ఉంది.
News January 23, 2026
రాష్ట్రంలోనే తొలిసారి నగరిలో..!

నెట్ జీరో క్యాంపస్ కాన్సెప్ట్‌ను ఫైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో తొలిసారి నగరి బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లలో అమలు చేయనున్నారు. ఇక్కడ ఎల్ఈడీ బల్బులు, 12 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తడి వ్యర్థాల నుంచి కంపోస్టు తయారీ చేస్తారు. వర్షపు నీటిని నిల్వ చేసి.. నీటి వృథాను తగ్గిస్తారు. పచ్చదనం కోసం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేస్తారు. సీఎం చంద్రబాబు శనివారం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.
News January 23, 2026
నగరిలో CM కాన్వాయ్ ట్రయల్ రన్

నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో కాన్వాయ్ ట్రయల్ రన్ శుక్రవారం నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి ట్రయల్ రన్ ప్రారంభమైంది. కీలక పాయింట్లు, ట్రాఫిక్ డైవర్షన్లు, సేఫ్టీ జోన్లపై సిబ్బందికి స్పష్టత ఇచ్చారు. వాహనాల మధ్య తగిన గ్యాప్ ఉండేలా పరిమిత వేగంతో, క్రమశిక్షణతో ప్రయాణించాలని ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.


