News June 2, 2024

Exit polls: నెల్లూరు రూరల్‌లో గెలిచేది ఎవరంటే..!

image

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొంచెం బార్డర్‌కు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని, చివరిగా వైసీపీ గెలిచే చాన్స్ ఉందని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు పోస్ట్ పోల్ సర్వే టీడీపీయే గెలుస్తుందని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.

Similar News

News January 23, 2025

ఎన్‌టీఎస్ఈ స్కాలర్‌షిప్ పునరుద్ధరణ చేయాలి: తిరుపతి ఎంపీ

image

ప్రతిష్ఠాత్మకమైన జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్‌టిఎస్‌ఇ) స్కాలర్‌షిప్‌ను పునరుద్ధరించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి లేఖ రాశారు. ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్ గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలన్నారు.

News January 22, 2025

రేపు నారా లోకేశ్ జన్మదిన వేడుకలు.. భారీ కేక్ కట్టింగ్

image

నారా లోకేశ్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించనున్నారు. లోకేశ్ 42వ జన్మదిన సందర్భంగా లోకేశ్ చిత్రపటంతో 42 కేజీల కేక్ తయారు చేయించి రేపు కట్టింగ్ సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొననున్నారు.

News January 22, 2025

కాకాణిపై మరో కేసు నమోదు.. పదికి చేరిన కేసుల సంఖ్య 

image

నెల్లూరు జిల్లా YCP అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కావలిలో మరో కేసు నమోదైంది.  ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడిన వైసీపీ నాయకుడిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన పోలీసులపై అనుచితంగా మాట్లాడారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో ఇప్పటికే వెంకటాచలం, ముత్తుకూరు, పొదలకూరు, కావలి ప్రాంతాలలో కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు పది కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.