News June 2, 2024
EXIT POLLS: ఉమ్మడి విజయనగం జిల్లాలో 2 ఎంపీ సీట్లు ఎవరివంటే!

విజయనగరం ఎంపీగా వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే అరకు ఎంపీ అభ్యర్థిగా చెట్టి తనూజ విజయం సాధిస్తారని పేర్కొంది. ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ స్థానాలనూ వైసీపీ కైవశం చేసుకుంటుందన్న ఈ సర్వేపై మీ COMMENT.
Similar News
News January 2, 2026
ఓడీఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ లక్ష్యాల సాధనకు వేగం పెంచాలి: VZM కలెక్టర్

టెలికాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం దిశానిర్దేశం చేశారు. ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్ పూర్తయిన గ్రామాలను వెంటనే డిక్లేర్ చేయాలని, ఇప్పటికే డిక్లేర్ చేసిన గ్రామాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద రోజుకు 47 వేల మాన్‌డేస్ లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలన్నారు.
News January 2, 2026
VZM: ఒక్కరోజే రూ.7.76 కోట్ల మద్యం ఫుల్‌గా తాగేశారు

విజయనగరం జిల్లాలో ఆబ్కారీ ఆదాయానికి 2026 సంవత్సరం ప్రారంభ రోజే కొత్త కిక్కునిచ్చింది. డిసెంబర్ 31న మందు బాబులు ఫుల్ జోష్ చేసుకున్నారు. ఏకంగా జిల్లాలో రూ.7.76 కోట్లు విలువ చేసే మద్యాన్ని తాగేశారు. గత ఏడాది రూ.5.27 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.2.50 కోట్ల ఆదాయం పెరిగింది. డిసెంబర్ 31న వైన్, బార్ అండ్ రెస్టారెంట్స్‌లో అమ్మకాలకు 2 గంటల వరకు అదనంగా అనుమతులు ఇచ్చారు.
News January 2, 2026
విశాఖ రేంజ్ ఐజీతో విజయనగరం ఎస్పీ భేటీ

విశాఖపట్నం రేంజ్ డీఐజీగా ఉన్న గోపినాథ్ జట్టి.. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ రేంజ్ కార్యాలయంలో ఐజీని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి నూతన సంవత్సరం, పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తామని ఐజీ గోపినాథ్ జట్టి పేర్కొన్నారు.


