News June 2, 2024

గుడిపాల ఎస్ఐ శ్రీనివాసరావు సస్పెండ్

image

చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐపై వేటు పడింది. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలో పోలింగ్ రోజున ఘర్షణలు జరిగాయి. ఎస్ఐ శ్రీనివాసరావు అలసత్వం కారణంగానే ఘర్షణ చెలరేగినట్లు జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌కు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషనర్‌కు నివేదిక పంపారు. దీంతో ఎస్ఐ సస్పెండ్‌కు సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ వెలువడ్డాయి.

Similar News

News March 1, 2026

రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.

News March 1, 2026

చిత్తూరు: HPV వ్యాక్సిన్‌పై అవగాహన

image

సర్వైకల్ క్యాన్సర్ వ్యాపించకుండా 14 ఏళ్లలోపు బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న సర్వేలో 4185 మంది క్యాన్సర్ అనుమానితులను గుర్తించారు. ఈ వ్యాక్సిన్ 18,500 మంది బాలికలకు అందించాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు.

News March 1, 2026

చిత్తూరు: చెత్త ఇస్తే డబ్బులు.. ఎంతో తెలుసా.?

image

పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం నెలలో ఒకరోజు పంచాయతీల పరిధిలో ఈ వాహనం పర్యటిస్తుందని అధికారులు తెలుపుతున్నారు. వాహనాలకు అందజేస్తే పాత ఇనుముకు కేజీ రూ. 20, అల్యూమినియం రూ. 120, స్టీల్ రూ.40, పేపర్లు రూ.15, పుస్తకాలు, అట్టపెట్టెలు రూ.10, ప్లాస్టిక్ రూ.20 చొప్పున చెల్లిస్తారని పేర్కొంటున్నారు.