News June 2, 2024
చిన్న ఘటనపై రాద్ధాంతం చేశారు: అంజలి
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ తనను తోసేసిన ఘటనపై హీరోయిన్ అంజలి మరోసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ స్టేజీ మీద ఏం జరిగిందనే విషయం మాకు మాత్రమే తెలుసు. కొద్దిగా జరగాలంటూ బాలయ్య నెట్టారు. నేను వెంటనే నవ్వేశా. చాలా చిన్న సంఘటనపై సోషల్ మీడియాలో అనవసర రాద్ధాంతం చేశారు’ అని పేర్కొన్నారు. బాలకృష్ణకు, తనకు పరస్పర గౌరవం ఉందని ఇటీవల <<13346819>>ట్వీట్<<>> చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 8, 2025
జులై నుంచి చిరంజీవి-అనిల్ మూవీ షూటింగ్?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 15న లాంచ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సమాచారం. మంచి కామెడీ టైమింగ్ ఉన్న వీరిద్దరి కాంబోలో ఎలాంటి మూవీ రూపొందనుందనే దానిపై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. అనిల్ డైరెక్ట్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈనెల 14న రిలీజ్ కానుండగా, చిరు ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.
News January 8, 2025
ఫార్ములా-ఈ కేసు: నేడు ఇద్దరి నిందితుల విచారణ
TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిని ఏసీబీ విచారించనుంది. ఈ కేసులో ఏ2గా అరవింద్, ఏ3గా BLN రెడ్డి ఉన్నారు. HMDA నుంచి FEOకు రూ.45.71 కోట్లు బదిలీ చేయడంపై వీరిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ ఈనెల 9న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
News January 8, 2025
స్నానం ఆపేస్తే ఆయుష్షు 34% పెరుగుతుందా!
చలికాలంలో స్నానం చేయడం మానేస్తే జీవితకాలం 34% పెరుగుతుందనడంలో నిజం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పుడో ఒకసారి మానేస్తే ఫర్వాలేదంటున్నారు. చల్లదనం వల్ల అసలే మెటాబాలిజం తగ్గుతుందని, స్నానం ఆపేస్తే ఇంకా కష్టమని పేర్కొంటున్నారు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రవాహం పెరిగి రిలాక్సేషన్ లభిస్తుందని చెప్తున్నారు. జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా బాడీ హైజీన్ పెంచుతుందని వెల్లడించారు.